ఈరోజు Exxeella Education Group ఆధ్వర్యంలో అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నగరంలో గల హోటల్ హరిత కాకతీయ నందు నిర్వహించడం జరిగింది. దీనిలో 30కి పైగా అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రతినిధులు హాజరు కాగా ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ , రూరల్ డెవలపమెంట్ & రూరల్ వాటర్ సప్లయ్ మంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ గారు, MLA దాస్యం వినయ్ భాస్కర్ గారు మరియు కాకతీయ అర్బన్ డెవప్మెంట్ & అథారిటీ చైర్మన్ సంఘం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గారు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఫెయిర్ ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను నిర్వహిస్తున్న ఎక్సల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ వారికి అభినందనలు తెలియచేస్తూ ఈ కార్యక్రమం లో తమని కూడా ఒక భాగం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. విదేశీ విద్య కోసం చాలా మంది విద్యార్ధులు ప్రయత్నిస్తూ యూనివర్సిటీలలో అడ్మిషన్ ఎలా పొందాలో తెలియక ఇబ్బంది పడుతుంటారని అటువంటి విద్యార్థులకు ఈ ప్రోగ్రాం ఒక మంచి అవకాశం అని ఈ అవకాశాన్ని వరంగల్ మరియు చుట్టూ ప్రక్క ప్రాంతాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్ధుల భవిష్యత్తుకై కృషి చేస్తున్న ఎక్సెల్ల వారిని కొనియాడుతూ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్ లో ఇంకా నిర్వహించాలని ఆకాంక్షించారు.
Also Read : Congo : కాంగోలో నరమేథానికి పాల్పడిన ఉగ్రవాదులు.. 20మంది మృతి
అనంతరం సంస్థ చైర్మన్ అరసవిల్లి అరవింద్ గారు మాట్లాడుతూ ఎక్సెల్లా ద్వారా ఇప్పటివరకు 10వేలకు పైగా స్టూడెంట్స్ ని విదేశాలకు పంపినట్లు తెలియజేస్తూ ఉన్నతమైన విశ్వ విద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేషన్ మరియు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం ద్వారా విద్యార్ధులు తమ భవిష్యత్ కు మంచి పునాదిని వేసుకోవడంతో పాటు విభిన్న సంస్కృతులు తెలుసుకోగలరని మన దేశం లో ఇంకా వృద్ది లోకి రాని ప్రొఫెషనల్ కోర్సులను అండర్ గ్రాడ్యుయేషన్ మరియు గ్రాడ్యుయేషన్ దశలోనే నేర్చుకోవడం ద్వారా విద్యార్ధులు మంచి భవిష్యత్ ను సొంతం చేసుకోగలరని వివరిస్తూ ప్రోగ్రాం కి విచ్చేసిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రోగ్రాం లో 300 లకు పైగా విద్యార్థులు పాల్గొని తమకున్న సందేహాలను తీర్చుకోగా, ఫెయిర్ నిర్వహించినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
Also Read : Saree Walkathon : సూరత్ లో ‘శారీ వాకథాన్’.. చీరలో ముద్దుగా ముద్దుగుమ్మలు