Extramarital Affairs: పెరిగిపోతున్న ఇల్లీగల్ ఎఫైర్స్.. భర్తలనే చంపేస్తారా..?
- ముడి వేసుకున్న బంధం కన్నా..!
- పెనవేసుకున్న బంధం మిన్నా..?
- కట్టుకున్నవాడిని పస్తులు పెట్టి..
- నచ్చినవాడి ఆకలి తీర్చవచ్చా?
- భర్తకి భార్య వ్యక్తిగత ఆస్తి కాదా?
- ఆమెకు ఇష్టమైతే గీత దాటొచ్చా?
- నైతికంగా తప్పయినా నేరం కాదా?
- న్యాయస్థానాలు ఏంచెబుతున్నాయ్?
Extramarital Affairs: వివాహేతర సంబంధం నేరం కాదు.. ఇది ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు. గతంలో సుప్రీంకోర్టూ ఇలాంటి తీర్పే ఇచ్చింది. కానీ నైతికంగా తప్పయినా నేరం కాదని స్పష్టం చేసింది. వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తూ కొన్ని కేసుల్లోనే ఈ తీర్పులు ఇచ్చాయి కోర్టులు. కానీ ఇంకోలా అర్థం చేసుకుంటున్నారు కొందరు. ఇల్లీగల్ ఎఫైర్స్ తో బంధాల్ని తెగ్గొస్తున్నారు? ఈ తరహా ఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి? వెస్ట్రన్ కల్చరే కారణమా?..
Read Also: AB Venkateswara Rao: పాలకుల కనుసన్నల్లో పోలీసులు చార్జిషీట్..
Also Read
భారతదేశంలో వివాహం చాలా పవిత్రమైంది. పెళ్లంటే నూరేళ్ల పంట అంటూ అగ్నిసాక్షిగా ఏడడుగులు వేస్తారు, వివాహ బంధం అంటేనే నమ్మకంతో కూడుకున్న రెండు జీవితాల ప్రయాణం.ఎక్కడెక్కడో పుట్టి.. పెళ్లితో ఒక్కటై.. ఒకరికి ఒకరు తోడుగా, కాలకాలం కలిసి ఉండాలని న్యూ లైఫ్ జర్నీమొదలుపెడతారు. ఇలా ఏటా వేల జంటలు ఒక్కటవుతుంటాయి. ఈ ప్రమాణం మధ్యలోనే బ్రేక్ చేసేవారు కొందరైతే.. మధ్యలోనే ముగించేవారు ఇంకొందరు.. కలిసి ప్రయాణిస్తూనే పక్క దారులు తొక్కేవారు మరికొందరు. కాలం మారింది. ట్రెండ్ మారింది. వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది. పాశ్చాత్య పోకడలతో సమాజం ఎటో వెళ్తుంది. మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయి. అగ్నిసాక్షిగా చేసుకున్న పెళ్లిళ్లకు విలువ లేకుండా పోతోంది. కొందరు కట్టుకున్న భార్యలను, కలకాలం కలసి ఉండాల్సిన భర్తలను విస్మరిస్తూ వివాహేతర సంబంధాలతో కాపురాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
Read Also: CM Revanth Reddy: నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
అయితే, నగరాల్లో వెస్ట్రన్ కల్చర్ పెరుగుతోంది. దీంతో పాటు అనైతిక బంధాలు ఎక్కువతున్నాయి. ఓయో రూమ్ లు, స్టార్ హోటళ్లల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాలు నడుస్తున్నాయి. ఫలితంగా ఇల్లీగల్ ఎఫైర్స్ పెరిగిపోతున్నాయి. గంటలకొద్దీ సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. వీళ్లను, వాళ్లను గెలుకుతూ గడిపేస్తున్నారు. ఇక్కడ జెండర్ తేడా ఏం లేదు. పడితే లైన్ ల పడతాది.. లేదంటే లైట్ అంటూ కొందరు రెచ్చిపోతున్నారు. పాతిక ముప్పై ఏళ్లు కాపురం చేసినోళ్లు కొందరు పక్క చూపులు చూస్తున్నారు. పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నారు. ఒకప్పుడు గుట్టుచప్పుడు కాకుండా సాగే వ్యవహారాలు ఇప్పుడు ఓయో రూమ్స్ కేంద్రంగా జరుగుతున్నాయి.
Read Also: TG Inter Results: రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ పలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
ఇక, 2023లో ప్రపంచవ్యాప్తంగా 50 వేలమంది మహిళలు, ఆడపిల్లలు హత్యకు గురయ్యారు. ఇందులో 60 శాతం కేసుల్లో వారిని భర్తలు, సహచరులు, కుటుంబ సభ్యులే చంపేశారు. సహా భాగస్వామిని చంపిన తరువాత మృతదేహాలను డ్రమ్ముల్లోనూ, ఫ్రిజ్ లోను, సూట్ కేసుల్లోనూ, భూమి అడుగున, మంచం కింద దాచేస్తున్నారు. అనేక సందర్భాల్లో అవశేషాలను మాయం చేయడానికి మృతదేహాన్ని ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. ముక్కలు చేసిన శరీర భాగాలను సూట్ కేసుల్లో సర్ది మారుమూల, నిర్మానుష్య ప్రదేశాల్లోనూ, నీటి కుంటలోనూ పడేస్తున్నారు. ఇటీవల ఇలాంటి నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి.
Read Also: Muthayya: ‘ముత్తయ్య’ నుంచి ‘సీనిమాల యాక్ట్ జేశి..’ సాంగ్ రిలీజ్
కాగా, ప్రేమించిన అనురాగ్ అనే వ్యక్తి కోసం తాను పెళ్లాడిన దిలీప్ ను ప్రగతి అనే యువతి చంపించింది. వారి పెళ్లి జరిగిన 15 రోజులకే ఈ హత్య జరిగింది. పెళ్లిలో వచ్చిన డబ్బుల్ని సుఫారీగా ఇచ్చి ప్రగతి ఈ ఘాతుకానికి పాల్పడింది. అలాగే, ఉత్తరప్రదేశ్‌లో మీరట్‌లో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, మృతదేహాన్ని సిమెంట్ డ్రమ్‌లో సీల్ చేసింది. అప్పట్లో నాగర్ కర్నూల్ ఘటనతో మొదలైన ఈ తరహా నేరాల పరంపర మొన్నటి బీరంగూడ ఎపిసోడ్ దాకా ఎన్నో జరిగాయి.
Read Also: Tirupati Police: తిరుమలకు సొంత కార్లలో వెళ్తున్నారా..? అయితే, ఇది మీ కోసమే..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. సగటున రోజుకు 140 మంది యువతులు, ఆడపిల్లలు ఇలా తమ గృహాల్లో కడతేరుతున్నారు. 2023 లెక్కలు, 2022లో ఇటువంటి కేసుల్లో ఆఫ్రికాలో అధికంగా నమోదయ్యాయి. ఏడాది తిరిగేసరికి ఆఫ్రికాను ఆసియా రెండో స్థానానికి నెట్టేసింది. ఈ తరహా కేసుల్లో 58 శాతం హత్య ఘటనలు వివాహ సంబంధంతో ముడిపడి ఉండగా ఇందులో 42 శాతం ఘటనలో పురుషులే బాధితులుగా ఉన్నారు.
తాజావార్తలు
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్‌పై బీసీసీఐ కఠిన చర్యలు.?
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
-
GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!