Zim vs Ban: ‘ఇన్నోసెంట్ కైయా’ సెంచరీ.. బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ తేడాతో జింబాబ్వే ఘన విజయం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zim vs Ban: హరారే వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు అద్భుత ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో మట్టి కురిపించింది. మ్యాచ్ మొత్తం మీద ఆధిపత్యం చెలాయించిన జింబాబ్వే.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
జింబాబ్వే విజయానికి ప్రధాన కారణం ఓపెనర్ ఇన్నోసెంట్ కైయా (Innocent Kaia). తొలి ఇన్నింగ్స్‌లో 227 బంతులు ఎదుర్కొన్న కైయా 17 ఫోర్లతో 140 పరుగులు చేసి టెస్టు క్రికెట్లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. అతని అద్భుత ఇన్నింగ్స్‌తో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగుల భారీ స్కోరు సాధించింది. కైయాకు బ్రియాన్ బెన్నెట్ 59 పరుగులు, కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ 60 పరుగులు, వెస్లీ మధేవెరే అజేయంగా 77 పరుగులతో మంచి సహకారం అందించారు. దీంతో జింబాబ్వే బంగ్లాదేశ్‌పై భారీ స్కోర్ సాధించింది.
Also Read
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
- Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
- Rohit Sharma: ‘ఇంకా ఆ పని పూర్తి కాలేదు’.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
మరోవైపు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. మొమినుల్ హక్ చేసిన 60 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఫలితంగా జట్టు కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయింది. జింబాబ్వే పేసర్లు రిచర్డ్ నగరవా, బ్లెస్సింగ్ ముజరబాని, న్యూమన్ న్యాంహురి అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. దీనితో ఫాలోఆన్ ఆడిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లోనూ మరోసారి కుప్పకూలింది. ముష్ఫికుర్ రహీమ్ 34, కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో 30 పరుగులు చేసినప్పటికీ.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో జట్టు 185 పరుగులకే కుప్పకూలింది. ముజరబాని 4, నగరవా 3 వికెట్లు తీసి జింబాబ్వే విజయాన్ని ఖాయం చేశారు.
ఇదిలా ఉండగా.. ఇన్నోసెంట్ కైయా ఇటీవల కాలంలో అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. గత 11 ఇన్నింగ్స్‌లలో ఏకంగా ఏడు సెంచరీలు బాదిన ఈ 33 ఏళ్ల బ్యాటర్.. 2026 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 110కు పైగా సగటుతో 995 పరుగులు సాధించాడు. ఈ కాలంలో కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే 30 పరుగుల లోపే ఔటయ్యాడు.
అంతర్జాతీయ క్రికెట్లో ఆలస్యంగా అడుగుపెట్టిన కైయా.. 30 ఏళ్ల వయసులో జింబాబ్వే తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు మూడు టెస్టుల్లో ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీ నమోదు చేసిన అతడు.. వన్డేల్లో 450 పరుగులు, టీ20ల్లో 290 పరుగులు చేశాడు. ప్రొఫెషనల్ క్రికెట్లో మొత్తం 11 సెంచరీలు సాధించిన కైయా ప్రస్తుతం జింబాబ్వే క్రికెట్లో ఓ వెలుగు వెలుగుతున్నాడు.
తాజావార్తలు
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
-
Asian Games 2026 Badminton: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ.. పీవీ సింధు ఓటమితో పతకాల ఆశలు ఆవిరి
-
Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
-
Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
-
Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?