Gudivada Amarnath: జగన్ పాదయాత్రతో కూటమికి ‘పాడే యాత్రే’.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర రాజకీయాలు, మహిళల భద్రత, హోంశాఖ పనితీరుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరినీ కించపరిచే విధంగా మాట్లాడలేదని స్పష్టం చేసిన ఆయన.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వాపోయారు. “మేకప్” అనే పదాన్ని ఉపయోగించినంత మాత్రాన మహిళా లోకాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లుగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను, పార్టీ నేతలను విమర్శించడానికి అవకాశం ఉంటే, తమకు కూడా రాజకీయ ప్రత్యర్థులపై స్పందించే హక్కు ఉందని అన్నారు.
సాయి కృష్ణ తల్లి ఎదుర్కొంటున్న బాధను చూసి మహిళా లోకం మొత్తం బాధపడుతోందని అమర్నాథ్ అన్నారు. అలాగే, ఒక ఎమ్మెల్యే మహిళను మోసం చేసి గర్భస్రావానికి కారణమయ్యారనే ఆరోపణలు వచ్చినప్పటికీ, ఆ అంశంపై హోంమంత్రి స్పందించలేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళల భద్రత అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఇదివరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పారని గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎంతమంది మహిళలను తిరిగి గుర్తించి వారి కుటుంబాలకు చేర్చారో చెప్పాలని ప్రశ్నించారు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
హోంశాఖ పనితీరుపై కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్ సైతం హోంమంత్రి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక మహిళపై నడిరోడ్డుపై దాడి జరిగినా సమర్థవంతమైన చర్యలు తీసుకోలేకపోతే హోంమంత్రి పదవిలో ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. మహిళల గౌరవం గురించి తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ఆయన.. రాజకీయ విమర్శలకు తాము కూడా అదే స్థాయిలో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. “ఈసారి అరే తురే అంటూ మాట్లాడితే మళ్లీ అదే స్థాయిలో స్పందన ఉంటుంది” అని వార్నింగ్ ఇచ్చారు.
రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలుపుతూ.. జగన్ పాదయాత్ర ప్రారంభమైతే అది అధికార కూటమికి “పాడే యాత్ర”గా మారుతుందని ఎద్దేవా చేశారు. ఇకపై హోంశాఖ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, శాఖలో జరుగుతున్న అవినీతి అంశాలను బయటపెడతానని అమర్నాథ్ తెలిపారు. తాను ప్రశాంతంగా ఉన్నప్పటికీ, రాజకీయ ప్రత్యర్థుల చర్యల వల్ల స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!