Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Extramarital Affair Murder In Agra Wife Lover Arrested For Husbands Brutal Killing

Extramarital Affair: సంబంధానికి అడ్డు.. భర్తను గొంతు నులిమి కాల్చి చంపిన భార్య, ప్రియుడు!

Published Date :April 6, 2026 , 6:33 pm
By Kothuru Ram Kumar
Extramarital Affair: సంబంధానికి అడ్డు.. భర్తను గొంతు నులిమి కాల్చి చంపిన భార్య, ప్రియుడు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Extramarital Affair: వివాహేతర సంబంధం కారణంగా ఉత్తరప్రదేశ్‌ లోని ఆగ్రా జిల్లాలో ఓ ప్రాణం బలి అయ్యింది. సైయా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంచలన కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి, నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టిన మృతుడి భార్య, ఆమె ప్రియుడు, మరొకడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Shocking Murder: అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన.. రాత్రంతా అడవిలోనే, కన్న కొడుకు ముందే తండ్రిని..!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైయా నివాసి లోకేంద్ర అనే వ్యక్తి ఏప్రిల్ 1, 2026న అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, దేవీ సింగ్ పురా మార్గంలోని ఒక పొలంలో సగం కాలిన మృతదేహం లభ్యమైంది. మృతుడి సోదరుడు శివచరణ్ ఆ మృతదేహం లోకేంద్రదేనని గుర్తించాడు. తన సోదరుడు చివరిసారిగా గ్రామానికి చెందిన మహేష్ ప్రజాపతితో కలిసి వెళ్లడం చూశానని, అలాగే తన వదినకు, మహేష్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందనే అనుమానాన్ని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ కేసును ఛేదించేందుకు ఆగ్రా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎస్ఓజి (SOG), సర్వైలెన్స్, సైయా పోలీసులతో కూడిన 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డ్స్ (CDR) విశ్లేషించిన తర్వాత, ఏప్రిల్ 3న పోలీసులు ప్రధాన నిందితుడు మహేష్ ప్రజాపతి, అతని స్నేహితుడు ధర్మవీర్, మృతుడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహం చేతిపై ఉన్న పేరు, ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు లోకేంద్ర హత్యను ధృవీకరించారు.

Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!

విచారణలో నిందితుడు మహేష్ తన నేరాన్ని అంగీకరించాడు. మృతుడి భార్యకు, మహేష్‌కు మధ్య ఉన్న సంబంధం గురించి లోకేంద్రకు తెలియడంతో వారు అతడిని అడ్డుతొలగించుకోవాలని పథకం వేశారు. ఏప్రిల్ 1న లోకేంద్ర ఇంటి నుండి బయటకు రాగానే అతని భార్య ఫోన్ చేసి మహేష్‌కు సమాచారం ఇచ్చింది. మహేష్ తన బైక్‌ పై లోకేంద్రను ఎక్కించుకుని, తన స్నేహితుడు ధర్మవీర్‌ తో కలిసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురూ కలిసి మద్యం సేవించిన తర్వాత, లోకేంద్ర గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గుర్తించకుండా ఉండేందుకు పెట్రోల్, గోధుమ గడ్డి వేసి నిప్పంటించారు. ఈ కేసులో నిందితులను జైలుకు తరలించారు పోలీసులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agra
  • Agra police
  • Crime News
  • Extramarital Affair
  • husband murder case

తాజావార్తలు

  • TN 2026 Movie: ‘టీఎన్ 26’ సినిమా కాదు, పొలిటికల్ అటాక్.. విజయ్ అభిమానుల ఫైర్!

  • Extramarital Affair: సంబంధానికి అడ్డు.. భర్తను గొంతు నులిమి కాల్చి చంపిన భార్య, ప్రియుడు!

  • Kitchen Tips: పాత గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరవాలా? అయితే ఈ అద్భుతమైన క్లీనింగ్ చిట్కా మీ కోసమే!

  • Shocking Murder: అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన.. రాత్రంతా అడవిలోనే, కన్న కొడుకు ముందే తండ్రిని..!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions