Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
- తక్కువ స్థలంలో ఎక్కువ బట్టలు ఆరబెట్టే స్మార్ట్ రాక్స్
- వాషింగ్ మెషీన్లో ఎక్స్ట్రా స్పిన్ ట్రిక్ ప్రయోజనాలు
- టవల్ టెక్నిక్‌తో తేమను త్వరగా తొలగించే చిట్కా
- చెడు వాసన రాకుండా బట్టలు తాజాగా ఉంచే మార్గాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేసిందంటే చాలు.. ఇంట్లో అందరికీ ఎదురయ్యే అతి పెద్ద సమస్య “బట్టలు ఆరకపోవడం”. బయట నిరంతరం పడే వర్షం, ఆకాశంలో మబ్బులు, వాతావరణంలో తేమ (Humidity) వల్ల బట్టలు అంత త్వరగా ఆరవు. దీనివల్ల బట్టల నుండి ఒక రకమైన చెడు వాసన (Damp smell) రావడం మొదలవుతుంది. మరి ఈ వర్షాకాలంలో బట్టలను ఇంట్లోనే స్మార్ట్‌గా, త్వరగా ఎలా ఆరబెట్టుకోవాలో.. అందుకు ఎలాంటి స్మార్ట్ ఐడియాలు, ఇండోర్ డ్రైయింగ్ రాక్స్ (Indoor drying racks) ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం!
1. స్మార్ట్ ఇండోర్ డ్రైయింగ్ రాక్స్ (Smart Drying Racks) : ఇప్పుడు మార్కెట్లో తక్కువ స్థలంలో ఎక్కువ బట్టలు ఆరబెట్టుకునేలా ఎన్నో రకాల ఆధునిక రాక్స్ అందుబాటులోకి వచ్చాయి.
Also Read
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
- Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
కొలాప్సిబుల్ / ఫోల్డబుల్ రాక్స్ (Foldable Racks): ఇవి చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి. బట్టలు ఆరబెట్టేటప్పుడు వీటిని ఓపెన్ చేసి హాల్లోనో, బాల్కనీలోనో పెట్టుకోవచ్చు. బట్టలు ఆరిపోయాక ఈజీగా ఫోల్డ్ చేసి మంచం కిందో లేదా తలుపు వెనుకో పెట్టేయొచ్చు.
సీలింగ్ మౌంటెడ్ డ్రైయింగ్ రాక్స్ (Ceiling Mounted Racks): మీ ఇంట్లో స్థలం అస్సలు లేదు అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. వీటిని బాల్కనీ లేదా హాల్ సీలింగ్‌కి (పైకప్పుకి) ఫిక్స్ చేస్తారు. పుల్లీ సాయంతో దీన్ని కిందికి దించి బట్టలు వేసి, మళ్లీ పైకి లాగేయవచ్చు. దీనివల్ల కింద స్థలం అస్సలు వేస్ట్ కాదు.
వాల్ మౌంటెడ్ కొలాప్సిబుల్ రాక్స్: వీటిని గోడకు అమర్చుకోవచ్చు. అవసరమైనప్పుడు లాగి, బట్టలు ఆరక ముడుచుకోవచ్చు.
2. వాషింగ్ మెషీన్ స్పిన్ ట్రిక్ (Extra Spin)
వర్షాకాలంలో బట్టలు ఉతికేటప్పుడు వాషింగ్ మెషీన్లో ‘ఎక్స్ట్రా స్పిన్’ (Extra Spin) ఆప్షన్‌ను ఉపయోగించండి. బట్టలు ఒకసారి స్పిన్ అయిన తర్వాత, మరోసారి స్పిన్ చేయడం వల్ల వాటిలో ఉండే తడి 90% వరకు పోతుంది. దీనివల్ల బట్టలు ఇంట్లో ఫ్యాన్ గాలికి కూడా చాలా త్వరగా ఆరిపోతాయి.
3. డ్రై టవల్ టెక్నిక్ (The Towel Trick)
చేత్తో ఉతికే బట్టల కోసం ఈ చిన్న చిట్కా బాగా పనిచేస్తుంది. బట్టలు ఉతికి బాగా పిండిన తర్వాత.. ఒక పెద్ద పొడి టవల్‌ను కింద పరిచి, దానిపై ఈ ఉతికిన బట్టను పెట్టాలి. ఇప్పుడు టవల్‌తో సహా ఆ బట్టను రోల్ చేస్తూ గట్టిగా ఒత్తాలి. ఇలా చేయడం వల్ల బట్టలోని అదనపు తేమను టవల్ పీల్చేసుకుంటుంది. ఆ తర్వాత ఫ్యాన్ కింద వేస్తే క్షణాల్లో ఆరిపోతుంది.
4. హ్యాంగర్ల వాడకం (Use Hangers)
డ్రైయింగ్ రాక్‌పై బట్టలను ఒకదానిపై ఒకటి లేదా దగ్గరదగ్గరగా వేయకండి. దానికి బదులు బట్టలను హ్యాంగర్లకు తగిలించి రాక్కి వేలాడదీయండి. దీనివల్ల బట్టల మధ్య గాలి బాగా ఆడి (Air circulation), త్వరగా ఆరడమే కాకుండా ముడతలు కూడా పడవు.
5. గదిలో తేమను తగ్గించండి (Dehumidifier & Fan)
ఇంట్లో బట్టలు ఆరబెట్టినప్పుడు ఫ్యాన్‌ను ఫుల్ స్పీడ్‌లో పెట్టడం ముఖ్యం. వీలైతే ఆ గదిలో ఒక ‘డీహ్యూమిడిఫైయర్’ (Dehumidifier) ఉంచితే అది గదిలోని తేమను లాగేసుకుని బట్టలు త్వరగా ఆరేలా చేస్తుంది. అలాగే బట్టలు ఆరబెట్టే గది కిటికీలను కొద్దిగా తెరిచి ఉంచడం వల్ల గాలి బయటకు లోపలికి వెళ్లి బట్టలు కుళ్లిన వాసన రాకుండా ఉంటాయి.
వర్షాకాలం అని కంగారు పడకుండా.. ఇలాంటి చిన్న చిన్న స్మార్ట్ ఐడియాలు , సరైన ఇండోర్ రాక్స్‌ని ఉపయోగిస్తే, ఇల్లు గజిబిజిగా మారకుండా బట్టలను చాలా ఈజీగా, తాజాగా ఆరబెట్టుకోవచ్చు. ఈ వర్షాకాలంలో మీరు కూడా ఈ టిప్స్ ట్రై చేసి చూడండి..
తాజావార్తలు
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
ట్రెండింగ్
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!