Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!
- ఆర్‌సీబీ vs సీఎస్‌కే మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్
- కేవలం 24 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన సర్ఫరాజ్
- సీఎస్‌కే కష్టాల్లో ఉన్న సమయంలో కీలకంగా నిలిచిన ఇన్నింగ్స్
- క్రునాల్ పాండ్యా బౌలింగ్‌లో సర్ఫరాజ్ అవుట్
- పెవిలియన్ కి వెళ్తున్న సమయంలో విరాట్ కోహ్లీ అభినందన
- కోహ్లీ చప్పట్లు కొడుతూ క్రీడాస్ఫూర్తి చాటిన ఘటన
- సోషల్ మీడియాలో వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarfaraz Khan – Virat Kohli: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ, సీఎస్‌కే (RCB vs CSK) జట్ల మధ్య జరిగిన పోరులో బెంగళూరు జట్టు చెన్నైపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకునే ఓ సందర్భం జరిగింది. మైదానంలో ప్రత్యర్థులుగా తలపడినా, క్రీడా స్ఫూర్తికి మించినది ఏదీ లేదని విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుత పోరాటాన్ని కోహ్లీ అభినందించడం ఇప్పుడు తెగ చర్చించుకుంటున్నారు.
BSNL Rs.1 Plan: రూ.1 ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆఫర్ అదిరిపోయిందిగా.. నెల రోజుల పాటు ఫ్రీ..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
మ్యాచ్ లో చెన్నై జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి వచ్చారు. పవర్ ప్లే లోనే రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మ్హత్రే, సంజూ శాంసన్ వంటి స్టార్ బ్యాట్స్మెన్స్ వికెట్లు కోల్పోయి సీఎస్‌కే 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ క్లిష్ట సమయంలో క్రీజ్ లోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ఆర్‌సీబీపై ఎదురుదాడికి దిగారు. కేవలం 24 బంతుల్లోనే 8 ఫోర్ల సాయంతో మెరుపు అర్ధసెంచరీ పూర్తి చేసి చెన్నైని గెలుపు దిశగా తీసుకవెళ్లాడు. ఇదివరకు ఆర్‌సీబీ తరపున ఆడిన సర్ఫరాజ్.. తన పాత జట్టు బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
అయితే క్రునాల్ పాండ్యా బౌలింగ్ లో సర్ఫరాజ్ అవుట్ అయి పెవిలియన్ వైపు వెళ్తున్నప్పుడు ఆసక్తికర సంఘటన జరిగింది. తన పాత టీమ్మేట్ సర్ఫరాజ్ ఆడిన పోరాట పటిమకు ముగ్ధుడైన విరాట్ కోహ్లీ, ఈల వేసి అతడిని పిలిచారు. దానితో సర్ఫరాజ్ వెనక్కి తిరిగి చూడగా, కోహ్లీ చప్పట్లు కొడుతూ అతని బ్యాటింగ్ ను అభినందించారు. మైదానంలో ఎంతటి వైరం ఉన్నా, ఒక మంచి ఆటగాడి ప్రతిభను గౌరవించడంలో కోహ్లీ ఎప్పుడూ ముందుంటారని ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది.
బంతి దొరికిందిరోయ్.. స్టేడియం బయట RCB Fans సందడి మాములుగా లేదుగా.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆశించిన ఫలితాలు రాకపోయినా సర్ఫరాజ్ ఖాన్ మాత్రం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ముంబైకి చెందిన ఈ స్టార్ బ్యాటర్, ప్రతి మ్యాచ్ లోనూ తన స్థాయిని పెంచుకుంటూ జట్టులో ఏకైక ఆశాకిరణంగా మారుతున్నాడు.
पवेलियन लौटते समय कोहली ने सरफराज को सीटी बजाकर उनकी बल्लेबाजी की सराहना की और ताली बजाई। कोहली का यह प्यारा सा भाव था। ❤️🙌🏻 pic.twitter.com/N7v5AVPvRz
— ममता ट्राबल (@Mamtasulaniya) April 5, 2026
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!