Ashish Banerjee Death: మాజీ డిప్యూటీ స్పీకర్ అనుమానాస్పద మృతి.. పార్టీ ఆఫీస్‌లో ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashish Banerjee Death: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నాయకుడు ఆశిష్ బెనర్జీ ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బీర్భుమ్ జిల్లాలోని రాంపూర్హాట్ నగరంలో ఉన్న ఆయన నివాసానికి అనుకొని ఉన్న పార్టీ కార్యాలయంలో ఆయన మృతదేహం ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆశిష్ బెనర్జీ బెంగాల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా సేవలు అందించారు. రాంపూర్హాట్ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి ధ్రువ సాహా చేతిలో పరాజయం పాలయ్యారు. రాంపూర్‌హాట్‌లోని హట్టాలాపారా ప్రాంతంలో నివసించే ఆశిష్ బెనర్జీ మృతదేహం పార్టీ ఆఫీసులో వేలాడుతూ లభ్యమైందన్న వార్త వ్యాపించడంతో, ఆ కార్యాలయం బయట పెద్ద ఎత్తున మద్దతుదారులు, స్థానికులు గుమిగూడారు. ఏళ్ల క్రితం మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన బెంగాల్ విద్యాశాఖ మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
తాజావార్తలు
-
Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!