తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా నాలుగోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అరగంట ముందే పోలింగ్ కేంద్రానికి భారీగా జనాలు వచ్చారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకునేందు టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసేందుకు వచ్చారు. ఎన్టీఆర్‌తో పాటు ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలిని వచ్చారు. క్యూలో నిల్చొని ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.