సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేటీఆర్ ని సీఎం చేయడానికి సీఎం కేసీఆర్ ఏమైనా చేస్తారనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్ళు కేసీఆర్ అడుగులో అడుగేసిన తనని అడ్డు వస్తానని బయటికి గెంటేశారని, మంత్రి హరీష్ రావును కూడా అదే గతి పట్టేదన్నారు. అల్లుడు కాబట్టి బచాయించిండు.. బయటివాన్ని కాబట్టి నన్ను నెట్టేసిండని ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ నేతలు సిద్ధమయ్యారని, వారు డబ్బు ఇస్తే తీసుకోండి.. ఓటు మాత్రం బీజేపీకి వేయండని ప్రజలను కోరారు. బస్తీ ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇచ్చే దమ్ము కేసీఆర్‌కు లేదని, పేదలు గుడిసెలు వేసుకున్న భూములను లాక్కొని, పేద్దోళ్లకు కట్టపెడుతున్నాడని ధ్వజమెత్తారు.
Also Read : AP Ministers: పేదరికాన్ని తరిమి కొట్టాలనేదే జగన్ లక్ష్యం..
ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రధానమంత్రి నాలుగు హామీలు చెప్పమన్నారన్నారు. కుటుంబ పెద్దకు బీజేపీ రూ.5 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తుందని, పేద వారికి 60 గజాల స్థలం లేదంటే డబుల్ బెడ్‌రూం, అర్హులైన వారికి తెల్లరేషన్ కార్డులు అందిస్తామని అన్నారు. కాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే అయిన ఈటల రాజేందర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ గడ్డ మీద సీఎం కేసీఆర్‌పై పోటీకి నిలబడ్డారు. ఇక్కడ మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్ అభివృద్ధి మంత్రంతో హ్యాట్రిక్ ధీమాతో ఉండగా, ఈటల బీసీ నినాదంతో బరిలోకి దిగారు. మరోవైపు కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
Also Read : Pet Dog Bite: అస్ట్రియా ప్రధానిని కరిచిన యూరప్ అధ్యక్షురాలి పెంపుడు శునకం