Etela Rajender : పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉచితంగా అందిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటలకు హారతులతో స్వాగతం పలికారు గ్రామస్థులు. వీరతిలకం దిద్దారు మహిళలు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఉపఎన్నికల్లో నన్ను కేసీఆర్ చాపను రాకినట్టు రాకిండు. నేను ఈసారి డబ్బులు ఖర్చుపెట్టే స్థితిలో లేను. ధైర్య లక్ష్మి మాత్రమే నా దగ్గర ఉందన్నారు. బెల్ట్ షాపులు బంద్ చేస్తే జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొనివచ్చారని, కేంద్రం నిధులు ఇవ్వకపోతే గ్రామపంచాయితీ సఫాయి కార్మికులకు కూడా జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు ఈటల. బలహీనవర్గాలకు రాజ్యాధికారం రాలేదు కాబట్టి మోదీ గారు హామీ ఇచ్చారు. దీన్ని తెలంగాణ అంతా అందిపుచ్చుకోవాలి. మొత్తం తెలంగాణ ఓట్లు వేస్తేనే బీసీ సీఎం సాధ్యం అవుతుందని, బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు ఇస్తామన్నారు ఈటల రాజేందర్. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అంతేకాకుండా..’సొంత ఇంటికల నిజం చేస్తాం. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉచితంగా అందిస్తాం. నాణ్యమైన వైద్యం ఉచితంగా అందిస్తాం. ముసలివాళ్లు ఇద్దరికీ పెన్షన్ ఇస్తాం. రైతు కూలీలులకు కూడా 5 లక్షల భీమా అందిస్తాం. మహిళలకు ఇన్సూరెన్స్ డబ్బులు మేమే కడతాం. ఒక్క కేజీ తరుగులేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం. మొత్తం దేశంలో బెల్ట్ షాపులు పెట్టి తాగిపించడంలో తెలంగాణ నంబర్ వన్. మద్యం మీద ఆదాయం 10,700 కోట్లు ఉంటే 45 వేల కోట్లు అయ్యింది. బెల్ట్ షాపులు బంద్ చేస్తే జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొనివచ్చారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే గ్రామపంచాయితీ సఫాయి కార్మికులకు కూడా జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. నీకు ఉన్న అప్పు మాత్రమే అప్పు కాదు.. ప్రభుత్వ అప్పు కూడా నీ తలకు పడుతుంది. తెలంగాణలో పుట్టబోయే బిడ్డమీద కూడా లక్ష 25 వేల రూపాయల అప్పుతో పుడుతుంది. కంచే చేనును మేసింది. కట్టుకున్నవాడే కాలయముడు అయ్యాడు. కేసీఆర్ కు ఓటు వేసినందుకు మాభూములు గుంజుకున్నారు అని గజ్వేల్ వారు ఆవేదన చెందుతున్నారు. ఆ ఆవేదన తీర్చేందుకే కేసీఆర్ ను ఓడించడానికి వెళ్తున్నా. నిరుద్యోగుల చావులు ఆగాలి. పెన్షన్ ఇస్తే సంబరపడుతున్నాం కానీ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వలేదు అనే విషయం మర్చిపోతున్నాం’ అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్‌గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!