Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Etela Rajender Commets On Cm Kcr

Etela Rajender : ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉందా?

Published Date :March 25, 2023 , 3:31 pm
By Gogikar Sai Krishna
Etela Rajender :  ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ మూడు తరాల ఉద్యమ చేసిందని, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో చార్మినార్ వద్ద ఆనాటి విద్యార్థులపై తూటాలు పేల్చితే 7 గురు విద్యార్థులు రక్తం మడుగులో గిలగిలా కొట్టుకుంటూ చనిపోయారన్నారు జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఏపీ ఏర్పడితే… 1969 వరకు మలి దశ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యోగాలను ఆంధ్రోళ్లు కొల్లగొడుతున్నారనే నినాదంతో ఉద్యమిస్తే… 369 మంది ముక్కుపచ్చలారని ముద్దు బిడ్డలు ప్రాణత్యాగం చేశారన్నారు. 2001 నుండి 2014 వరకు పార్టీలకు, జెండాలకు, రాజకీయాలకు అతీతంగా మూడో దశ ఉద్యమం జరిగింది. ఉస్మానియా వర్శిటీలో పోరాట బొడ్రాయిని పెట్టి ఉద్యమించింది. సామాన్యుడిని నుండి పెద్దల దాకా జేఏసీని ఏర్పాటు చేసుకుని నీళ్లు-నిధులు-నియామకాల పేరుతో ఉద్యమించామని ఆయన వెల్లడించారు. తెలంగాణ వచ్చినంక లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆర్దిక మంత్రిగా నేనే అసెంబ్లీలో ప్రకటించిన. అవన్నీ భర్తీ చేస్తామని ప్రకటించిన. ఐటీ, ఫార్మాసహా హైదరాబాద్ కంపెనీలతోపాటు సింగరేణి ద్వారా లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారన్నారు.

Also Read : Delhi excise case: సిసోడియాకు ఎదురుదెబ్బ… బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

‘ఆనాడు ఏ ఉద్యోగాలొస్తాయని సంబురపడ్డమో… వాటి సంగతి అటుంచితే ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులు సమ్మె చేస్తే కలం పోటుతో 17 వందల మందిని తీసేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్లను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని హెచ్చరిస్తే 39 మంది కార్మికులు గుండెపోటుతో చనిపోయారు. సింగరేణిలో ఉన్న ఉద్యోగాలను కుదించేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండొద్దని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ వాటిని రద్దు చేయకపోగా…ప్రభుత్వ శాఖలన్నింటిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనే నియమించారు. చివరకు టీఎస్పీఎస్సీలో కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారంటే ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉందా? గత 4 ఏళ్లలో 11 వేల కు మించి ఉద్యోగాలను కూడా భర్తీ చేయని కేసీఆర్… దీనినిబట్టే నిరుద్యోగులపట్ల కేసీఆర్ కు ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకోవాలి. చదువుకున్న పిల్లలంతా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారనే భయంతో ఎన్నికల ఏడాది వస్తున్నందున వాళ్లంతా కోచింగ్ సెంటర్లలో బిజీగా ఉండాలని నోటిఫికేషన్లు ప్రకటించారే తప్ప వాళ్లపై ప్రేమతో కాదు.. టీఎస్సీఎస్సీలో 6 పరీక్షలు ప్లాన్ చేస్తే… అవన్నీ లీకై 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ ను నాశనం చేశారు. నిజాయితీగా చదువుకుంటే ఉద్యోగం రాదనే స్థితికి తీసుకొచ్చారు. దీనిపై ఉద్యమిస్తున్న ఉస్మానియా, కాకతీయ విద్యార్థులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నీ భరతం పట్టే సమయం వచ్చింది… నీ చెంప చెళ్లుమన్పించే సమయం వచ్చింది.

Also Read : IPL 2023 : అన్‌బాక్స్ ఈవెంట్ కోసం RCBలో చేరిన గేల్, AB డివిలియర్స్

మాలాంటి వాళ్లకు వచ్చే నిరుద్యోగులకు పైరవీలు ఉండవు… కష్టపడి చదివే వాళ్లకు ఉద్యోగాలొస్తాయని మేం చెబుతుంటే…. అందుకు భిన్నంగా పేపర్ లీక్ చేస్తూ ఉద్యోగాలను దోచుకుంటున్నరు. టీఎస్సీఎస్సీ కమిషన్ ఛైర్మన్ ను నియమించింది కేసీఆరే కదా… నమ్ముకున్న వాళ్లు ఎందుకు మోసం చేశారో ఆలోచించండి… 30 లక్షల మంది యువత కన్నీళ్లు పెడుతున్నారు. కత్తులు నూరుతున్నారు.. ఈ సర్కార్ కు కనువిప్పే సమయం వచ్చింది. కేసీఆర్ సర్కార్ కూలిపోవడానికి ఎంతో దూరంలో లేదు… అధికారాన్ని తీసేసే సత్తా తెలంగాణ ప్రజలకే ఉంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బండి సంజయ్ నాయకత్వంలో పేపర్ లీకేజీ, నియామకాలపై చేస్తున్న పోరాటానికి మద్దతివ్వండి… మీ సిట్ పై ప్రజలకు నమ్మకం లేదు. మియాపూర్ భూములపైనా, నయీం డైరీ, డ్రగ్స్ పై సిట్ వేస్తే ఏమైంది? నీ చెప్పుచేతుల్లో ఉండే అధికారులను సిట్ రూపంలో నియమించి నివేదికలను దాచుకుంటున్నారు.

Also Read : IPL 2023 : అన్‌బాక్స్ ఈవెంట్ కోసం RCBలో చేరిన గేల్, AB డివిలియర్స్

అందుకే సిట్టింగ్ జడ్జితో సంపూర్ణంగా విచారణ జరిపించాల్సిందే. అప్పుడే లీకేజీ బాధ్యులెవరో తేలుతుంది. లీకేజీకి సంపూర్ణ బాధ్యత కేసీఆర్ ఫ్రభుత్వమే తీసుకోవాలి. లిక్కర్ స్కాంలో బిడ్డను కాపాడుకోవడానికి కేసీఆర్ యత్నిస్తున్నారే తప్ప నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదు… ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తారు… ఇప్పటివరకు కళ్లు నెత్తికెక్కి ఉన్న వ్యవస్థలను ఎట్లా నీరుగారుస్తున్నరో చూస్తున్నాం… అందరం కలిసి కేసీఆర్ సర్కార్ పై కలిసి పోరాడతాం… సర్కార్ అక్రమాలపై బీజేపీకి సంపూర్ణ సమాచారం ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం’ అని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • cm kcr
  • Etela Rajender
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Yuvraj Singh: ‘6 నెలలు మాత్రమే బతుకుతామన్నారు’.. క్యాన్సర్ పరిస్థితులపై యూవరాజ్ సింగ్ భావోద్వేగం..

  • GT Closest Wins : గుజరాత్ టైటాన్స్ చరిత్రలోనే క్లోజ్ విక్టరీ.. థ్రిల్లర్ విజయాల్లో టాప్‌లో జీటీ!

  • Selfie Accident: సెల్ఫీ సరదా.. మూడు నిండు ప్రాణాలు బలి.!

  • Harish Rao : పొంగులేటి.. పొగరు తగ్గించుకో, నీ చిట్టా నా దగ్గర ఉంది..

  • Adivi Sesh: వాళ్ళకి ఈలలు, కేకలు వేసి నా సినిమాకి టికెట్లు కొన్నారు.. హీరోలపై శేష్ సెన్సేషనల్ కామెంట్స్

ట్రెండింగ్‌

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions