Etela Rajender : గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారిందని ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకుంటే ఈ మాత్రం పనులు కూడా కనిపించవన్నారు. సీసీ రోడ్లు, చౌరస్తాలో వెలిగే లైట్లు, స్మశాన వాటికలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి..వీటిపై చర్చకు వస్తారా రండని, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కోసం 25 ఏళ్లు కొట్లడినాం.. మూత వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం… తెరిచింది బీజేపీ ప్రభుత్వమన్నారు ఈటల రాజేందర్ రెడ్డి. కాజీపేట కొచ్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, చేతిలో ఉన్న పని చేసే దమ్ము రేవంత్ కు లేదు.. కానీ కిషన్ రెడ్డి మీద విమర్శలు చేస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పనులు ఎలా ముందుకు వెళ్తావని, తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుందన్నారు ఈటల రాజేందర్. అంతేకాకుండా.. చర్లపల్లి రైల్వే టెర్మినల్ దగ్గర బస్ స్టాప్ కట్టలేని దుస్థితి అని, కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ లో పనులు చూసి రావాలని రేవంత్ కు సూచించారు. మోడీని విమర్శించడం సూర్యుడిపై ఉమ్మి వేసినట్లే అని, మోడీ మీద మాట్లాడిన కేసీఆర్ ఏమైపోయారో రేవంత్ కు అదే గతి పడుతుందన్నారు ఈటల రాజేందర్. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితి నెలకొంది.. సిగ్గు అనిపించడం లేదా ? అని ఆయన ప్రశ్నించారు.
అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం అన్ని విధాలుగా సహకారం చేస్తోందన్నారు. మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వడం లేదని, తెలంగాణలో ప్రతీ మున్సిపాల్టీ అమృత్ స్కీం కింద వచ్చే నిధులతోనే నడుస్తున్నాయన్నారు. తెలంగాణ నడుస్తుందే కేంద్ర నిధులతోనే.. కానీ ఉల్టా మా మీదే ఆరోపణలు చేస్తున్నారని, మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీదే గెలుపు అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. BRS, కాంగ్రెస్ లోపాయికారీ చీకటి ఒప్పందం చేసుకున్నారని, ఎమ్మెల్సీ స్థానాలలో అందుకే BRS అభ్యర్థులను నిలపలేదన్నారు. రేవంత్ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటే గత పదేళ్లలో జరిగిన అవినీతిపై ఎందుకు సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదు ? అని ఆయన ప్రశ్నించారు. 8 మంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతుంటే… కప్పం కట్టడానికి రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని, రేవంత్ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
IND vs NZ: న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అతనికి అవకాశం ఇవ్వాలి..- కైఫ్
