Site icon NTV Telugu

Etala Rajender : “ఆనాడు మీరు చేసిందేంటి?”.. కశ్మీర్ సమస్యకు కారణం కాంగ్రెస్ కాదా?

Eatala Rajendar

Eatala Rajendar

సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన ఇంకా కశ్మీర్ సమస్య అలాగే ఉంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కశ్మీర్ కి స్వతంత్రపతిపత్తి ఇచ్చి వివాదానికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆనాడు ఇందిర గాంధీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకొని ఉంటే ఈనాడు భారత్ దేశానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేదా ? అని నిలదీశారు. 370 ఆర్టికల్ ను రద్దుచేసి కశ్మీర్‌ని భారత దేశంలో అంతర్భాగం చేసిన ధీరుడు నరేంద్ర మోడీ అని.. మోడీ మీద విమర్శలు చేయడం సూర్యుని మీద ఉమ్మివేయడమనని తెలిపారు. ప్రపంచంలోనే నరేంద్ర మోడీ పెద్దన్న పాత్రను పోషిస్తున్నారని.. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆగాలని కోరుకున్న వ్యక్తి మోడీ అని కొనియాడారు. సమస్య పరిష్కరించడం ముఖ్యమని.. దేశ భద్రత పట్ల కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని దుయ్యబట్టారు.

READ MORE: Off The Record: ఏపీ బీజేపీ పాత ముద్ర చెరిపేయడానికి తంటాలు పడుతోందా?

ప్రాసకోసం, రాజకీయంకోసం మీరు మాట్లాడుతున్న మాటలు సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. జైహింద్ పేరుతో సైనికుల కోసమని ర్యాలీ పెట్టి రాహుల్ గాంధీని ప్రధాని చేద్దాం అంటారు.. ఏం మాట్లాడుతున్నారో సోయి ఉండే మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. ఢిల్లీలో వెళ్లి మోడీని పొగుడుతారు.. గల్లీలో వచ్చి తిడతారని విమర్శించారు.. కేంద్ర ప్రభుత్వ చేస్తున్న పనులపై మీ మంత్రులు కొనియాడతారు.. మీరేమో తిడతారు.. ఇదేనా మీ నైజం? అని తీవ్రంగా మండిపడ్డారు. మల్కాజ్గిరి ప్రజలు అప్పట్లో గుండెల్లో పెట్టుకొని గెలిపించారని అంటున్నారు. అందుకేనా వారికి గుండె కోతను మిగుల్చుతున్నారు? అని ఎద్దేవ చేశారు. అందుకేనా హైడ్రాను తీసుకువచ్చి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజల ఉసురు పోసుకుంటున్నారని, గుండెల్లో పెట్టుకుని.. అభిమానించినందుకేనా ఆత్మహత్యలు చేసుకొనేలా చేస్తున్నారని నిలదీశారు. రక్తాన్ని చెమటగా మలచి గెలిపిస్తే వారి రక్తాన్నే కళ్ళు చూస్తున్నారన్నారు. ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని.. మీకు ఓట్లు వేసి గెలిపించినందుకా? ప్రజల కన్నీళ్లు చూసి సంతోషపడుతున్నారన్నారు.

READ MORE: Karnataka: ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో ఏం రాసిందంటే..!

Exit mobile version