సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన ఇంకా కశ్మీర్ సమస్య అలాగే ఉంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కశ్మీర్ కి స్వతంత్రపతిపత్తి ఇచ్చి వివాదానికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆనాడు ఇందిర గాంధీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకొని ఉంటే ఈనాడు భారత్ దేశానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేదా ? అని నిలదీశారు.