వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ వీఆర్‌ఏలకు ప్రభుత్వ ఉద్యోగులకు నియమిస్తూ నియామాక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. వీఆర్ఏ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల 500 మంది, జనగామ జిల్లా లో 314 మంది వీఆర్ఏ లకు లబ్ది చేకూరిందన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూశాం, ఇప్పుడు కేసీఆర్ పాలన చూస్తున్నాం, అప్పట్లో పట్వారీ వ్యవస్థ ఏది చెప్తే అదే ఉండేది, పటవారీలు పటేల్లుగా పెత్తనం చేసేవారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పట్వారీ వ్యవస్థను తీసేసి వీఆర్ఏ లను చేస్తే, మన మనసున్న మహారాజు సీఎం కేసీఆర్ వీ.ఆర్.ఎ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని ఆయన అన్నారు.
Also Read : MP Ranjith Reddy : తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్‌కు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు
అంతేకాకుండా.. ఒకనాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తేనే గుర్తింపు ఉండేది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే గౌరవం ఎక్కువ అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌కి గోరి కడతాం అని పిచ్చి కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీనాయకులకు ప్రజలు అటు కేంద్రం లో ఇటు రాష్ట్రం లో ఎప్పుడో గోరి కట్టారని ఆయన మండిపడ్డారు. లేని పోనీ కూతలు కూస్తున్న ప్రతిపక్షాలకు వీఆర్ఏ లు బుద్ధి చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.
Also Read : Renu Desai: పవన్ మూడు పెళ్ళిళ్ళపై సినిమా.. వీడియో రిలీజ్ చేసిన రేణు దేశాయ్