Renu Desai Releases a video on Pawan kalyan wives and children: గత కొద్ది రోజుల క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ బ్రో సినిమా అనూహ్యంగా చర్చలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో శ్యాంబాబు అనే పాత్ర ద్వారా తనను అవమానించే ప్రయత్నం చేశారని అంబటి రాంబాబు మీడియా ముందుకు రావడమే కాదు పవన్ కళ్యాణ్ మీద ఆయన వ్యక్తిగత జీవితం మీద సినిమాలు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే కొన్ని వెబ్ సిరీస్లు కూడా తెరకెక్కించే అవకాశం ఉందని ఆయన కామెంట్లు చేసిన నేపధ్యంలో ఈ వ్యవహారం మీద పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించారు. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఈ వీడియో ఎందుకు పెట్టానని చాలామంది అనుకోవచ్చు కానీ దీనికి ఒక క్లారిటీ ఇచ్చి ముగించాలని తాను వీడియో చేస్తున్నాను అని పేర్కొన్నారు రేణు దేశాయ్. ఈ మధ్యకాలంలో విడుదలైన ఒక సినిమా అనుకోకుండా వివాదాలకు కారణమైందని, అయితే ఆ సినిమాలో ఏం జరిగిందనే విషయం ఏదో తనకు పూర్తిగా అవగాహన లేదని ఎందుకంటే తాను భారతదేశంలో లేనని ఆమె చెప్పారు.
Gandeevadhari Arjuna Trailer: భూమికి పట్టిన అతిపెద్ద క్యాన్సర్.. మనిషి
తన భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనే విషయం తనకు తెలిసిందని ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం తన మాజీ భర్తతో ఎవరికైతే అభిప్రాయ భేదాలు ఉన్నాయో వారు తన మాజీ భర్త భార్యల గురించి నలుగురు పిల్లల గురించి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయడానికి సిద్ధమయ్యారని ఇది వారికి ఒక పర్సనల్ అపీల్ అని భావించాల్సిందిగా కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఒక తల్లిగా నేను ఇది రిక్వెస్ట్ చేస్తున్నానని ఆమె అన్నారు. వృత్తిపరంగా అయినా రాజకీయపరంగా అయినా ఏం జరిగినా మీరు మీరు చూసుకోండి కానీ పిల్లల్ని ఇందులోకి లాగొద్దు. ఒక సినిమా స్టార్ కి రాజకీయంగా ఎదుగుతున్న ఒక వ్యక్తికి వారు పిల్లలు కాబట్టి వారు ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. వారు ఇంకా ఇప్పుడు పిల్లలే కదా, వాళ్లు రాజకీయాల్లో చేయాల్సిందేమీ లేదు రాజకీయంగా జరుగుతున్న విషయాల్లో వాళ్ళు వేలు పెట్టలేదు కదా. నేనొక తల్లిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్యాన్స్ కానివ్వండి హేటర్స్ కానివ్వండి సపోర్టర్స్ కానివ్వండి దయచేసి పిల్లల్ని ఇందులోకి లాగొద్దు.
కేవలం నా పిల్లల్ని కాదు ఏ పొలిటికల్ లీడర్ పిల్లల్ని సినిమా నటీనటుల పిల్లల్ని కూడా ఈ విషయాల్లోకి లాగొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి గాని పిల్లలు, భార్యల జోలికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక పవన్ తన విషయంలో చేసింది తప్పేనని ఇప్పటికీ 100% బల్లగుద్ది చెబుతున్నానని అంటూనే పొలిటికల్ గా అలాగే సమాజానికి ఆయన ఉపయోగపడతారని కూడా నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు. ఆయనకు డబ్బు మీద యావలేదని కేవలం ప్రజలందరూ బాగుండాలని కోరికతోనే రాజకీయాల్లో ఉన్నారని తాను నమ్ముతున్నాను కాబట్టి పొలిటికల్ గా ఆయనకు సపోర్ట్ చేస్తానని రేణు దేశాయ్ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ పేదలకు ఏదో చేయాలని బలంగా ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడని తాను బలంగా నమ్ముతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా నేను పడుతున్న బాధ పక్కనపెట్టి ఆయనకు పొలిటికల్ గా సపోర్ట్ చేస్తానని రేణు దేశాయ్ అన్నారు. నేను బాధపడుతున్నా పొలిటికల్ గా ఆయనకి సపోర్ట్ చేస్తున్నానని మీరు కూడా అవకాశం ఉంటే సపోర్ట్ చేయాలని ఆమె కోరారు.