Liver Health: మన శరీంలో లివర్ 500 పైగా పనులు నిర్వహిస్తుంది. మనజీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని లివర్ ఫిల్టర్ చేస్తుంది. మనంతిన్న ఆహారం జీర్ణం చేయడానికి కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఆహారంలోని వ్యర్థాలను, విషతుల్యాలను.. శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా లివర్ నియంత్రించేందుకు లివర్ కీలకంగా మారింది. ఇక ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్‌లను, కాలేయం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. అయితే.. చాలా వరకు 90 శాతం కాలేయం దెబ్బతినేంతవరకు వ్యాధి లక్షణాలు బయటపడవు. అంతేకాకుండా.. లివర్ సమస్యలు ఉంటే కొన్ని సందర్భాల్లో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి కానీ.. నిజానికి, లివర్ సమస్యలను గుర్తించడం కష్టమే అని చెప్పాలి. మనకు సాధారణంగా, కడుపులో అసౌకర్యం ఉంటే వికారంగా, వాంతి వచ్చేలా ఉంటుంది. మరికొన్ని సార్లు వాంతులు కూడా అవుతూ ఉంటాయి. అయితే.. చాలా మంది ఇది కడుపులో అసౌకర్యంగా భావించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ.. ఈ సమస్య పదేపదే ఇబ్బంది పెడుతుంటే మీ లివర్‌లో సమస్య ఉందని అర్థం.
Read also: KTR tweet: అదానీ కోసం బయ్యారం బలి.. ముంద్రా దగ్గరా?
అంతేకాదు.. నోటి పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వల్ల ఒక్కోసారి కాలేయంలో సమస్యలు వచ్చినా నోటి నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. అయితే.. కామెర్లు, హెపటైటిస్. ఈ సమస్యలు ఉంటే.. కళ్లు పసుపు పచ్చగా మారతాయి. నిద్ర లేవగానే కళ్లు పసుపు రంగులోకి మారితే కాలేయ సమస్య ఉన్నట్లు అనుమానించాలి. మూత్రం రంగులో మార్పు వస్తే కిడ్నీ, కాలేయంలో సమస్యలున్నట్లు భావించాలి. ముఖ్యంగా శరీరంలోని మలినాలను తొలగించే కాలేయం సరిగా పనిచేయకపోతే పైత్యరసం, లవణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరంలో పేరుకుపోయి చివరికి మూత్ర విసర్జన మరియు మలవిసర్జన సమయంలో బయటకు వస్తాయి. మీరు తగినంత నీరు త్రాగకపోతే మూత్రం ముదురు రంగులో ఉంటుంది. మీరు తగినంత నీరు త్రాగినప్పటికీ, మీ మూత్రం ముదురు రంగులో ఉంటే, మీరు కాలేయ సమస్యను అనుమానించవలసి ఉంటుంది. మీకు కాలేయ సమస్యలు ఉంటే, మీ చేతులు మరియు కాళ్ళు అకస్మాత్తుగా ఉబ్బుతాయి. కాలేయం సరిగా పనిచేయకపోయినా, శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే.. సరైన జీవనశైలిని అనుసరించాలని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మీ ఆహారంలో ఆకు కూరలు, పండ్లు, నానబెట్టిన బాదం, ఎర్ర బియ్యం తీసుకోవాలని సూచించారు. ప్రాసెస్ చేసిన ఆహారం, ప్యాకేజ్ ఆహారం, స్వీట్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి.
KTR tweet: అదానీ కోసం బయ్యారం బలి.. ముంద్రా దగ్గరా?