America : అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. 11 ఏళ్ల బాలుడు తన పాఠశాల క్యాంపస్‌లోని రెండు రాళ్ల మధ్య 9 గంటల పాటు చిక్కుకున్నాడు. 9 గంటల పాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడని, క్షేమంగా ఉన్నాడని తెలిపారు. ఆదివారం సాయంత్రం పాఠశాల ఆవరణలో నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థి రెండు పెద్ద రాళ్ల మధ్య చిక్కుకుపోయాడని పాఠశాల విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. స్కూల్ సిబ్బంది వెంటనే అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ ఫలించలేదు. దీని తరువాత స్థానిక అత్యవసర సేవలను పిలిచారు.
Read Also:BJP Leader Kolanu Shankar: బాలాపూర్ లడ్డూను ప్రధాని మోడీకి అందిస్తాం..
హిల్స్‌బరో ఫైర్ చీఫ్ కెన్నీ స్టాఫోర్డ్ మాట్లాడుతూ.. రక్షకులు ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రెండు పెద్ద బండరాళ్ల మధ్య చిక్కుకున్న బాలుడిని కనుగొన్నారు. తెల్లవారుజామున 3:15 గంటలకు బాలుడిని బండరాళ్ల మధ్య నుండి బయటకు తీశారు. అతన్ని పరీక్ష కోసం ఆసుపత్రికి పంపారు. తరువాత అతన్ని అక్కడి నుండి డిశ్చార్జ్ చేశారు.
రెస్క్యూ ఆపరేషన్ గురించి సమాచారం ఇస్తూ.. రెస్క్యూ కోసం మొదట తాళ్లను ఉపయోగించామని, అయితే అది విజయవంతం కాలేదని స్టాఫోర్డ్ చెప్పారు. దీని తర్వాత రాళ్లను పగులగొట్టే ప్రయత్నం చేసినా అది కూడా సఫలం కాలేదు. దీని తరువాత, రెస్క్యూ టీమ్ రాళ్ల మధ్య సొరంగం చేసింది. అప్పుడే బాలుడిని బయటకు తీశారు. ఈ మిషన్‌లో బాలుడి భద్రత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రెస్క్యూ వర్కర్లు బాలుడి మోకాళ్లకు, వీపుకు డిష్ సోప్, షీట్లను పూసారు. తద్వారా అతన్ని గాయం లేకుండా పైకి లేపారు. అగ్నిమాపక, రాష్ట్ర పోలీసులు సహా ఐదు వేర్వేరు విభాగాల సభ్యులు రెస్క్యూలో పాల్గొన్నారు.