Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేతగా ఎలాన్ మస్క్ ప్రపంచంలో చాలా కొద్ది మందికే పరిచయం. ఎప్పుడైతే ట్విటర్ కొనుగోలు చేశాడో సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచంలోని చివరి మనిషి వరకు ఆయన పేరు ప్రస్తుతం మార్మోగిపోతుంది. ట్విటర్ పగ్గాలు చేపట్టిన తొలి రోజే ఆయన ఆ కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్ ను తొలగించారు. ఇప్పటి వరకు కొత్త సీఈవోను ప్రకటించలేదు. సీఈవోతో పాటు పలువురు కంపెనీ ప్రముఖులను తొలగిచడం సంచలనంగా మారింది. అంతే కాకుండా కంపెనీ ఖర్చు తగ్గించుకోవాలని సూచించినట్లు సమాచారం. ఆ క్రమంలోనే పనితీరు బాగోలేని ఉద్యోగులను తొలగించాలని.. అందుకు కొందరి పేర్లు సూచించాలని మేనేజర్లకు ఆదేశాలు సైతం జారీ చేశారు. దీంతో ట్విట్టర్ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు.
Read Also: Satyadev Kancharana: సత్యదేవ్ పారితోషికం రెట్టింపు
మరోవైపు ట్విట్టర్ మస్క్ మార్క్ భారీ మార్పులు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన ఆలోచనలు ఎవరికీ అర్థం కావడం లేదంటూ అనుకుంటున్నారు. ట్విట్టర్ కొత్త సీఈవో ఎవరో ప్రస్తుతానికి తనకు కూడా తెలియదని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. కానీ, పరాగ్ అగర్వాల్ తదితరులను తొలగిస్తూ ఆయన సైన్ చేసిన ఎస్ ఈసీ పత్రం మాత్రం వేరే కథ వెల్లడిస్తుంది. అది ఎలాన్ మస్క్‌ను ట్విట్టర్ కొత్త సీఈవోగా చూపిస్తోంది.
Read Also: Hardeep Singh Puri: రష్యా నుంచి ఆయిల్ కొంటాం.. పాశ్చాత్య మీడియాకు కేంద్రమంత్రి దిమ్మతిరిగే సమాధానం
కంపెనీ పగ్గాల చేపట్టిన మస్క్.. పరాగ్, లీగల్ హెడ్ విజయ గద్దె, సీఎఫ్ఓ నెల్ సెగల్ పై వేటు వేశారు. ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన తర్వాత మస్క్ ట్విట్టర్ బోర్డును రద్దు చేసి, కంపెనీకి ఏకైక డైరెక్టర్ అయ్యారు. అయితే, ఈ మార్పులు తాత్కాలికమే అని ఎలాన్ మస్క్ అంటున్నారు. ఈ లెక్కన ఆయన ట్విట్టర్ డైరెక్టర్ గా కూడా ఉండబోరని తెలుస్తోంది. అలాగే, సంస్థకు త్వరలోనే బోర్డును కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ట్విట్టర్ లో ప్రస్తుతం 7500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మస్క్ 75 శాతం సిబ్బందిని తొలగిస్తారన్న వార్తలను మస్క్ ఖండించారు.