Satyadev Kancharana: ఇటీవల విడుదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ సినిమాల జయాపజయాలను పక్కన పెడితే వాటిలో నటించిన సత్యదేవ్ కి మాత్రం మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు. ఓ వైపు హీరోగా చేస్తూనే ఈ రెండు సినిమాలలో కీరోల్స్ పోషించాడు సత్యదేవ్. అంతేకాదు ఈ రెండు సినిమాలతో వచ్చిన గుర్తింపు తన పే చెక్ డబుల్ అయ్యేలా కూడా చేసింది. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఉత్తరాదిన విడుదల కావటంతో పాటు ఆ వెంటనే వచ్చిన ‘రామసేతు’ సినిమాలో పాత్రతో బాలీవుడ్ ఆడియన్స్ కు బాగా దగ్గర అయ్యాడు సత్యదేవ్. అయితే సోలో హీరోగా సత్యదేవ్ కి ఇప్పటి వరకూ మంచి బ్రేక్ రాలేదు.
Read also: Bandi sanjay: మీ ముఖాలకు 1st తారీఖు న జీతాలు అడిగారా
వచ్చి ఉంటే మరింత గుర్తింపు వచ్చి ఉండేది. అయితే హీరోగా నటించిన సినిమాల కంటే కూడా ఎక్కువ గుర్తింపును ‘గాడ్ ఫాదర్, రామ్ సేతు’ ద్వారా సంపాదించుకోగలిగాడు. అందుకేనేమో సత్యదేవ్ పై భారీ పెట్టుపడులను పెట్టడానికి కూడా నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. కానీ ఈ టైమ్ లోనే సత్యదేవ్ సెలక్టీవ్ గా ఉండాలి. లేకుంటే కెరీర్ చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. హీరోగా నటిస్తున్నప్పుడు తీసుకునే పారితోషికం కంటే ప్రధాన పాత్రలు పోషించిన సినిమాల ద్వారానే ఎక్కవ పారితోషికాన్ని అందుకోబోతున్నాడు సత్యదేవ్. మరి మునుముందు సత్యదేవ్ ఇంకే స్థాయికి వెళతాడన్నద చూడాలి.
China: “జిమ్మి సాంగ్”కు చైనాలో క్రేజ్.. బప్పిలహరి పాటతో ప్రజల నిరసన