టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ను సంచలనాలకు మారుపేరుగా చెప్పొచ్చు. ఆయన ఏం చేసినా సంచలనమే. ట్విటర్ ను కొనుగోలు చేసిన నాటి నుంచి అయితే ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ తో కేజ్ ఫైట్ కు రెడీ అంటూ ఛాలెంజ్ చేయడం సంచలనం సృష్టించింది. మొదట్లో ఈ కేజ్ ఫైట్ కేవలం పుకారే అనుకున్న ఇది నిజంగానే జరగనున్నట్లు వీరు స్ఫష్టం చేశారు. ఈ దిగ్గజాల మధ్య త్వరలోనే కేజ్ ఫైట్ జరగనుందని సమాచారం.
Also Read: Viral Video: ప్రియురాలి కోసం వెళ్లి బుక్కైన ప్రియుడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో!
అయితే ఈ ఫైట్ కు సంబంధించి మస్క్ బాగానే ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా మస్క్ ఓ ఫోటోను షేర్ చేశారు. అయితే ఆ ఫోటో పోస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ఫోటోలో తన కొడుకుతో కలిసి మస్క్ వర్కవుట్లు చేస్తున్నాడు. కొడుకుతో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ జోడించి మస్క్ దానిని ట్విటర్ లో పంచుకున్నారు. దీంతో ఆ ఫోటో వైరల్ గా మారింది. దానిని 23 మిలియన్ల మందికి పైగా చూడగా, దాదాపు 5 లక్షల మంది లైక్స్ కొట్టారు.