Elon Musk: ఎలోన్ మస్క్ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత నిరంతరం కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతూనే ఉన్నారు. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ వచ్చే ఏడాది Xలో మస్క్ పెద్ద మార్పులు చేయబోతున్నారు. వచ్చే ఏడాది నుండి ట్విటర్ డేటింగ్ యాప్‌గా కూడా పని చేస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో లిండా యాకారినో చెప్పారని ఓ నివేదిక పేర్కొంది. రాబోయే సంవత్సరాల్లో ట్విటర్ ఎలా ఉంటుందనే దాని గురించి మస్క్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ట్విటర్ త్వరలో డిజిటల్ బ్యాంక్‌గా పని చేస్తుందని, ఇది బ్యాంక్ ఖాతా అవసరాన్ని కూడా తొలగించగలదని కూడా ఒక నివేదిక చెబుతోంది.
Read Also:Babar Azam: అంపైర్ అవుట్ ఇచ్చి ఉంటే.. మేం రేసులో ఉండేవాళ్లం: బాబర్
మస్క్ బ్యాంక్ ఖాతా అవసరాన్ని తొలగించడానికి సిద్ధమవుతున్నాడు. గత ఏడాది నవంబర్‌లో ది వెర్జ్ రిపోర్టు ప్రకారం మస్క్ ఎక్స్‌ని బ్యాంక్‌గా మార్చాలనుకుంటున్నారు. ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత ఉద్యోగులతో జరిగిన మొదటి సమావేశంలో ట్విటర్ ను డిజిటల్ బ్యాంక్‌గా మార్చాలనే ఆలోచనను మస్క్ పంచుకున్నట్లు చెప్పబడింది. ఇందులో తన డిజిటల్ బ్యాంక్ ఆలోచన అధిక లాభాల మనీ మార్కెట్ ఖాతాలు, డెబిట్ కార్డ్‌లు, చెక్కులు, రుణాలకు సంబంధించినదని మస్క్ చెప్పారు.
Read Also:Onion Price: దేశ రాజధాని ఢిల్లీలో ‘సెంచరీ’ కొట్టిన ఉల్లి.. త్వరలోనే రూ.150కూడా
ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థతో పాటు సంక్లిష్టమైన, ఖరీదైన క్రెడిట్ కార్డ్ సిస్టమ్‌కు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని వినియోగదారులకు అందించాలని మస్క్ ఆలోచిస్తున్నాడు. సానుకూల ఖాతాలు ఉన్న వినియోగదారులకు ట్విట్టర్ ఎక్కువ వడ్డీని ఇస్తుందని, రెడ్ ఖాతాలు ఉన్న వారి నుండి తక్కువ వడ్డీని వసూలు చేస్తుందని మస్క్ చెప్పారు. మస్క్ ఈ సేవ ద్వారా వినియోగదారులకు బ్యాంక్ ఖాతా అవసరాన్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మస్క్ చెప్పాడు.