BMW CE 04 Electric Scooter Price in India: జర్మనీకి చెందిన ప్రీమియం వాహనాల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’.. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ‘బీఎండబ్ల్యూ సీఈ 04’ పేరిట స్కూటర్‌ను తీసుకొచ్చింది. కొన్నేళ్లుగా విద్యుత్తు కార్లు విక్రయిస్తున్న బీఎండబ్ల్యూ సంస్థ.. ద్విచక్ర వాహనాలను తీసుకురావడం మాత్రం ఇదే తొలిసారి. సీఈ 04 స్కూటర్ ధర ధర రూ.14.9 లక్షలుగా (ఢిల్లీ ఎక్స్‌షోరూంలో) ఉంది. ఈ ధర చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు.…
బీఎండబ్ల్యూ (BMW)మోటోరాడ్.. తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియా మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. BMW CE 04గా పిలిచే ఈ స్కూటర్ జూలై 24న ప్రారంభం కానుంది. ప్రీమియం తయారీదారు నుంచి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో భారత మార్కెట్లో ఈ బీఎండబ్ల్యూ సీఈ 04కు ప్రత్యక్ష పోటీదారులు ఎవరూ లేరు.