ఈ నెల 25 వ తేదీన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను 17 న విడుదల చేస్తామని తెలిపారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా తో మాట్లాడుతూ.. . టీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ క్షేత్ర స్థాయి నుంచి మొదలుకుని పట్టణ, మండల స్థాయి వరకు కమిటీ నిర్మాణం పూర్తయిందని చెప్పారు. అలాగే.. అక్టోబర్ 25 న జనరల్ బాడీ మీటింగ్… ఆ తర్వాత పార్టీ ప్లీనరీ సమావేశం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన నవంబర్ 15 న వరంగల్ లో తెలంగాణ విజయ గర్జన నిర్వహిస్తామన్నారు. ఈ విజయ గర్జనను విజయవంతం చేసేందుకు అక్టోబర్ 27 నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు ఉంటాయని ప్రకటించారు కేటీఆర్.