Marriage Scam: హైదరాబాద్ నగరంలో మరో కొత్త రకమైన మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో వృద్ధులను టార్గెట్ చేస్తూ ఇద్దరు మహిళలు మోసాలకు పాల్పడుతున్న ఘటన మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సంపన్నులు, రిటైర్మెంట్ అయినా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారు మ్యారేజ్ బ్యూరో పేరుతో ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తున్నారు ఇద్దరు మహిళలు. తాజాగా ఓ వృద్ధుడు వీరి ఉచ్చులో పడ్డాడు. పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆయన పెళ్లి అని నమ్మి మోసపోయాడు.
Read Also: Addanki Dayakar: విచారణ కమిషన్ శీలాన్ని శంకించవలసిన పనిలేదు.. ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు..!
అంతేకాకుండా, పెళ్లి షాపింగ్ పేరుతో ఇద్దరు మహిళలు అతని నుండి రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు. పెళ్లి కోసం ప్రత్యేకంగా డ్రెస్సులు కూడా కొనిపించుకున్నారు కూడా. ఇక అన్ని సెట్ అనుకోని పెళ్లికి సిద్ధంగా బట్టలు వేసుకుని ఎదురుచూస్తున్న వృద్ధుడుకి, చివరకు పెళ్లికూతురు సమయానికి రాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. దీనితో మహాంకాళి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. అక్కడ తనకు జరిగిన మోసాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు మహిళలు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. మ్యారేజ్ బ్యూరోలు, పెళ్లి ప్రకటనల విషయంలో ముందుగానే పూర్తి సమాచారం సేకరించకపోతే ఇలాంటి మోసాలకు బలికావాల్సిందే.
Read Also: Gulzar House Fire Incident: దాని వల్లే గుల్జార్ హౌస్ ప్రమాదం.. నిర్ధారించిన అధికారులు..!