మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు అద్భుతంగా డాన్స్ చెయ్యగలరు అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఇండియాలోనే డాన్స్ సూపర్బ్ గా వెయ్యగల స్టార్ హీరోలైన చరణ్, బన్నీలు ఒకే సాంగ్ కి డాన్స్ వేస్తే ఎలా ఉంటుంది? అది కూడా మంచి ఐటెం సాంగ్ కి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అంటే అన్నారు కానీ ఆ ఊహే ఎంత బాగుందో కదా? ఈ ఊహనే నిజం చేస్తూ ఒక ఎడిటెడ్ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో ‘మా బావ మనోభావాలు’ సాంగ్ ఇటివలే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఈ పాటలోని విజువల్స్ ని ఎడిట్ చేసి చరణ్, అల్లు అర్జున్ ల డాన్స్ బిట్స్ ని సింక్ చేస్తూ ఒక వీడియో బయటకి వచ్చింది. చరణ్ నటించిన రంగస్థలం సినిమాలోని జిగేల్ రాణి డాన్స్ బిట్ ని, ఇద్దరమ్మాయిలతో సినిమాలోని అల్లు అర్జున్ డాన్స్ మూమెంట్ ని కట్ చేసి ‘మా బావ మనోభావాలు’ వీడియోలో పెట్టారు. మధ్యలో వచ్చిన మ్యుజిక్ కి, బావా అనే ఖోరస్ కి బ్రహ్మానందం క్లిప్స్ ని కూడా యాడ్ చేశారు. చూడగానే నవ్వించగల ఈ ఎడిటెడ్ ఫ్యాన్ మేడ్ వీడియోని చూసి మీరు కూడా ఎంజాయ్ చెయ్యండి.
https://twitter.com/tweetsraww/status/1606645055527464960
Read Also: NTR: ‘లే బాబాయ్.. లే’ చలపతిరావు మృతిపై జూ.ఎన్టీఆర్ భావోద్వేగం