Rajastan: రాజస్థాన్‌లో ఈడీ మరోసారి రంగంలోకి దిగింది. జల్ జీవన్ మిషన్ కుంభకోణం కేసుకు సంబంధించి శుక్రవారం ఉదయం రాజస్థాన్‌లోని 25 చోట్ల ఈడీ బృందం దాడులు చేసింది. రాజస్థాన్‌లోని జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలకు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. జైపూర్‌లోని ఐఏఎస్ సుబోధ్ అగర్వాల్ లొకేషన్‌లతో సహా 25 చోట్ల ఈ సోదాలు జరిగాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దాడిపై సీఎం గెహ్లాట్ స్పందిస్తూ.. ‘ఇంత పెద్ద దేశంలో ఆర్థిక నేరాలు జరగడం లేదా? ఏజెన్సీలు దీనిపై దృష్టి సారించాలి. ఇడి ఫోకస్ కేవలం రాజకీయ నాయకులపైనే.. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇడిని ఉపయోగించడం తప్పు.. ఎన్నికల్లో గెలవడానికి ఇడి సిబిఐ ద్వారా డర్టీ రాజకీయాలు చేస్తున్నారు. అంటూ వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేయగా, మరోవైపు జైపూర్‌లోని కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా నివాసంపై దాడి చేసింది.
Read Also:BCCI-Team India: బీసీసీఐ చీటింగ్.. భారత జట్టుకు స్పెషల్ బాల్స్ ఇస్తోంది! అందుకే వరుస విజయాలు
తమిళనాడులో ఐటి రైడ్స్..
మంత్రి ఈవీ వేలు ఇంటిపై ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై, తిరువళ్ళూరు, తిరువన్నాలై,కోయంబత్తూరులోని నలబై పైగా ఏకకాలంలో ఐటి సోదాలు అధికారులు చేస్తున్నారు. మంత్రి ఇల్లుతో పాటు ఆయనకు సంబంధించిన ప్రైవేట్ కాలేజీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని రియల్ ఎస్టేట్ , కన్‌స్ట్రక్షన్ కంపెనీలపై ఐటి రైడ్స్ జరుగుతున్నాయి. చెన్నై,కోయంబత్తూరు, తిరుచ్చి సహా 80 ప్రాంతాలలో కొనసాగుతూన్న ఐటి సోదాలు చేస్తున్నారు అధికారులు.
Read Also:MLA Lakshmareddy: అమ్మాపూర్‌లో లక్ష్మారెడ్డి ప్రచారం.. బీఆర్‌ఎస్‌లో చేరిన 150 మంది నాయకులు