MLA Lakshmareddy: అమ్మాపూర్‌లో లక్ష్మారెడ్డి ప్రచారం.. బీఆర్‌ఎస్‌లో చేరిన 150 మంది నాయకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Lakshmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవాబుపేట మండలం అమ్మాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను ఆరా తీస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంతటి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న కేసీఆర్ సర్కార్ కి మద్దతు తెలుపాలని కోరారు. రేపు నవంబర్ 30వ తేదినా జరుగబోయే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని లక్ష మెజారిటీ తో గెలిపించాలని లక్ష్మారెడ్డి ప్రజలను కోరారు. ప్రచారంలో భాగంగా.. ఇవాళ నవాబుపేట మండలం అమ్మాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు.
ఉదయం నుంచి ప్రజలతో మమేకమై బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని వివరిస్తూ సాగుతున్నారు. ఈనేపథ్యంలో.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 150 మంది నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు చంద్రప్రకాష్ రెడ్డి, రామకృష్ణరెడ్డి, సిద్ధిరాంరెడ్డి, ఆంజనేయులు.. కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకి చెందిన నాయకులందరికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి అమ్మాపూర్ గ్రామం తరుపున పూర్తి మద్దతునిస్తూ కారుగుర్తుకు ఓటువేసి లక్షఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
మరోవైపు బాలానగర్ మండలం చింతకుంట తండాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తండాకు చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు రవీందర్, వార్డు సభ్యులు రాజేశ్వరి, శ్రీనివాస్, రమేష్ సహా 100 మంది నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నూతనంగా చేరిన వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి పూర్తి మద్దతునిస్తూ కారు గుర్తుకు ఓటువేసి లక్షఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Huchamma Chowdhury: బడికోసం స్థలం దానమిచ్చి వృద్దురాలు ..నిస్వార్ధానికి రాజ్యోత్సవ అవార్డు..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు