లోక్ సభ ఎన్నికలకు యావత్ భారతదేశం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాగా.. ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఊహాగానాల పర్వం మొదలైంది. వివిధ సంబంధిత అధికారులను ఉద్దేశించి, 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 16 నుండి ప్రారంభమవుతాయని లేఖలో తెలిపారు. ఈ వైరల్ నోటిఫికేషన్‌లో.. ఈ తేదీని దృష్టిలో ఉంచుకుని ఇతర విషయాలను ప్లాన్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాగా.. తాజాగా ఎన్నికల సంఘం ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది.
Read Also: Mamata Banerjee: రాజకీయ కార్యక్రమాలకు సెలవు ప్రకటిచారు.. నేతాజీ జయంతికి ఎందుకు సెలవు ఇవ్వలేదు..?
ఏప్రిల్ 16 అనేది లోక్ సభ ఎన్నికల తేదీ కాదని ఈసీ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలను ప్లాన్ చేసి వాటిని సకాలంలో పూర్తి చేయాల్సిన గడువు తేదీ అని స్పష్టం చేసింది. ఆ తేదీ లోపు ఎన్నికల ప్రణాళికల ప్రకారం పనులన్నీ పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని సీఈవో కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు సంబంధిత వర్గాలకు ఈ నెల 19న అధికారిక లేఖను జారీ చేశామని వెల్లడించింది.
Read Also: YSRCP: రాజ్యసభ కోసం వైసీపీ వ్యూహాత్మక అడుగులు.. ఆ ఆరుగురిపై కూడా వేటు..!
అంతేకాకుండా.. లోక్‌సభ ఎన్నికలను ఏ తేదీ నుంచి వాయిదా వేయవచ్చనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయని కమిషన్ తెలిపింది. ఇదిలా ఉండగా, ఎన్నికల తేదీలపై కూడా చర్చలు జరుపుతున్నారని.. ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సరైన సమయంలో ప్రకటిస్తుందని సీఈవో కార్యాలయం తెలిపింది. ఈ క్లారిటీతో ఎన్నికల తేదీకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు తెరపడుతుందని కమిషన్ ఆశాభావం వ్యక్తం చేసింది.