Site icon NTV Telugu

Eatala Rajendar: హైడ్రా దుర్మాగమైన ఆలోచన.. ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు..

Eatala Rajendar

Eatala Rajendar

గొప్ప విజనరీ ఉన్న నేత, స్మితప్రజ్ఞశాలీ మోడీ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. స్కాములకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్రంత అవినీతి చరిత్ర.. ఎండ్లకు ఏండ్లు అవమాన పడి, కొట్లాడి, ఎదురునిలిచి త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. రేవంత్ వల్ల తెలంగాణ ఆతగౌరవం దెబ్బతిన్నదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచారన్నారు.. దేశాన్ని ప్రపంచానికే విశ్వగురువుగా నిలబెట్టిన ఘనత మోడీదని కొనియాడారు. దేశం విశ్వగురువుగా ఎదుగుతుందని..
మోడీ అంటే దేశానికి నమ్మకమన్నారు. వర్క్ స్పీక్ ఎవ్రిథింగ్ అనే సూత్రానికి నిదర్శనం మోడీ అన్నారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ అడుగు జాడల్లో నడుస్తున్న నేత మోడీ అని.. కాలికి ముళ్ళు నాటితే నోటితే తీసే నాయకుణ్ణి ప్రజలు కోరుకుంటారన్నారు.

READ MORE: Iran Israel Conflict: ఇరాన్ అధ్యక్షుడుతో ఫోన్‌లో మాట్లాడిన పీఎం మోడీ.. కీలక సూచన

పదవులు ఉంటాయి, పోతాయి, మానవ సంబంధాలే ముఖ్యమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. “కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలో అనేక పనులు, పథకాలు నడుస్తున్నాయి. కళ్ళుండి చూడలేని కబోధులు కాంగ్రెస్ నేతలు. దుర్మాగమైన ఆలోచన హైడ్రా, మూసి ప్రక్షాళన. దుర్మార్గమైన హైడ్రా, మూసీ ప్రభుత్వ చర్యలపై మల్కాజిగిరి ప్రజలు తిరగబడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అంటే ఏంటో ప్రజలకు తెలిసిపోయింది. రాబోవు కాలంలో మల్కాజిగిరి రెండు పార్లమెంట్ నియోజక వర్గాలు అవుతాయి. జీహెచ్‌ఎంసీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి బీజేపీకి సింహభాగం అవుతుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు.

READ MORE: Vikarabad: అంబేద్కర్ విగ్రహం ధ్వంసం.. పెద్ద ఎత్తున ఆందోళన..

Exit mobile version