గొప్ప విజనరీ ఉన్న నేత, స్మితప్రజ్ఞశాలీ మోడీ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. స్కాములకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్రంత అవినీతి చరిత్ర.. ఎండ్లకు ఏండ్లు అవమాన పడి, కొట్లాడి, ఎదురునిలిచి త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. రేవంత్ వల్ల తెలంగాణ ఆతగౌరవం దెబ్బతిన్నదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచారన్నారు..
Tiranga Yatra: భారత సైనిక దళాల ధైర్యసాహసాలను స్మరించుకుంటూ బీజేపీ పార్టీ మంగళవారం (మే 13) నుంచి దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ను ప్రారంభించనుంది. ఈ యాత్ర మే 13 నుంచి మే 23 వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. తాజాగా విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఈ యాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక నేడు సాయంత్రం 4 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. దేశభక్తి, ఐక్యత, సైనికుల సేవలకు గౌరవం తెలిపేలా…
పహల్గాం ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్.. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ మంగళవారం అర్ధరాత్రి పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. ఈ మేరకు ఆపరేషన్ సింధూర్‌లో 100 మందికి పైగా టెర్రరిస్టులు మృతి చెందినట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఈ మెరుపు దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టింది. పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆపరేషన్ సిందూర్ విజయం ప్రశంసనీయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన సాయుధ దళాలు నిన్న తీసుకున్న చర్యకు, వారు ప్రదర్శించిన ధైర్యం, పరాక్రమాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన రక్షణ మంత్రి పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను మన దళాలు ధ్వంసం చేసిన విధానం మనందరికీ గర్వకారణమన్నారు. 'ఆపరేషన్ సిందూర్' ఖచ్చితత్వంతో నిర్వహించారన్నారు.
India Republic Day: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ (Kartavya Path)లో ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం మరింత ప్రత్యేకంగా ఉండడంతో త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు…