East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్
- జూదం కోసం సన్యాసిరావు వరుస చోరీలు
- బెయిల్‌పై బయటకు వచ్చి మరీ దొంగతనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని అనపర్తి పోలీసులు, రాజమహేంద్రవరం క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది సంయుక్తంగా అరెస్టు చేశారు. జూదం కోసం వరుస చోరీలకు పాల్పడి కటకటాలు పాలయ్యాడు. జైలు నుండి బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి.. ఘరానా దొంగను అరెస్ట్ చేసారు.
పోలవరం జిల్లా అడ్డతీగల మండలం గొంతువానిపాలెం గ్రామానికి చెందిన చిలపనశెట్టి సన్యాసిరావు జూదానికి బానిసై.. డబ్బుల కోసం చోరీలను వృత్తిగా మార్చుకున్నాడు. 2019 నుంచి రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని.. తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలను అపహరిస్తూ వచ్చాడు. అతనిపై ఇప్పటికే 45 చోరీ కేసులు నమోదై ఉండగా.. ఐదు కేసుల్లో శిక్ష కూడా అనుభవించాడు. మరో 20 కేసులు ప్రస్తుతం కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ చోరీ కేసులో అరెస్టై రిమాండ్‌కు వెళ్లిన సన్యాసిరావు.. ఈ ఏడాది మార్చి 26న బెయిల్‌పై విడుదలయ్యాడు.
Also Read
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సన్యాసిరావు తన తీరు మార్చుకోకుండా.. మార్చి 31న అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అనంతరం కోరుకొండ, రావులపాలెం, ఆలమూరు, నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో మరో ఆరు చోరీలు చేశాడు. లక్ష్మీనరసాపురం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు అనపర్తి మండలం కొప్పవరం బ్రిడ్జి సమీపంలో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి రూ.58.09 లక్షల విలువైన 385 గ్రాముల బంగారం, 110 గ్రాముల వెండి వస్తువులు, రూ.5 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజమహేంద్రవరం డీఎస్పీ విద్య మీడియాకు వెల్లడించారు.
తాజావార్తలు
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..