Duleep Trophy 2024: నేటి నుంచే రెండో రౌండ్.. అందరి దృష్టి శ్రేయస్‌పైనే!
- నేటి నుంచి రెండో రౌండ్ మ్యాచ్‌లు
- అనంతపురంలోనే రెండు మ్యాచ్‌లు
- దులీప్ ట్రోఫీలో సర్ఫరాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీలో రెండో రౌండ్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి రెండో రౌండ్ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. నేడు అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియంలో ఇండియా-ఎ, ఇండియా-డి జట్లు తహలపడనుండగా.. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం బిలో ఇండియా-బి, ఇండియా-సి టీమ్స్ తలపడనున్నాయి. రెండు మ్యాచ్‌లు ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానున్నాయి. తొలి రౌండ్లో ఇండియా-బి, ఇండియా-సి విజయాలు సాధించగా.. ఇండియా-ఎ, ఇండియా-డి ఓడిపోయాయి. రెండో గెలుపుపై బి, సి జట్లు గురిపెట్టగా.. బోణీ కొట్టాలని ఎ, డి భావిస్తున్నాయి.
రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్‌లకు బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టులో చోటు దక్కలేదు. రెండో రౌండ్లో సత్తాచాటితే బంగ్లాతో రెండో టెస్టుకు బీసీసీఐ సెలెక్టర్ల నుంచి పిలుపు రావొచ్చని ఈ ముగ్గురు ఆశాభావంతో ఉన్నారు. ముఖ్యంగా శ్రేయస్ భారీ ఇన్నింగ్స్ ఆడి భారత జట్టులోకి రావాలని చూస్తున్నాడు. ప్రస్తుతం భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లలో సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే దులీప్ ట్రోఫీ ఆడనున్నాడు. బంగ్లాతో తొలి టెస్టుకు అతడు ఎంపికయినా.. తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవు. న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు అవకాశం దక్కనుంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
Also Read: ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌తో భారత్‌కు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
ముషీర్ ఖాన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, నవదీప్ సైనీ, ముకేశ్ కుమార్‌పై ఇండియా-బి భారీగా ఆశలు పెట్టుకుంది. ఇండియా-బిని అభిమన్యు ఈశ్వరన్ నడిపించనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఇండియా-సి జట్టు సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, బాబా ఇంద్రజిత్, మానవ్ సుతార్‌లపై ఆధారపడనుంది. ఇండియా-ఎకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్ కాగా.. రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివమ్ దూబె, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ వంటి భారత స్టార్స్ జట్టులో ఉన్నారు. ఇండియా-డికి శ్రేయస్ అయ్యర్ సారథి కాగా.. దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్, రికీ భుయ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, శ్రీకర్ భరత్ జట్టులో ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!