Naga Vamsi: ‘ఇది అంత కలర్‌ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Vamsi: సినిమా ఫీల్డ్ బయటికి ఎంతో కలర్‌ఫుల్ ప్రపంచంలా కనిపించినప్పటికీ.. నిర్మాతలు, దర్శకులు ఎదుర్కొనే ఒత్తిడి అంతా బయటకు కనిపించదని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. సినిమా ఫెయిల్యూర్‌ను తాను అంత సింపుల్‌గా తీసుకోలేనని, సినిమా రిలీజ్‌కి ముందు తీవ్ర ఒత్తిడికి గురవుతానని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. సినిమా నిర్మాణంలో ఉండే మానసిక ఒత్తిడి, రిలీజ్ సమయంలో ఎదురయ్యే టెన్షన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూరేనని.. దాన్ని తాను అంత ఈజీగా అంగీకరించలేనని చెప్పారు. సినిమా ఫలితం నెగిటీవ్ వస్తే కొన్ని రోజుల పాటు తాను మానసికంగా తీవ్రంగా ప్రభావితమవుతానని చెప్పారు.
ముఖ్యంగా సినిమా రిలీజ్‌కి ముందు రోజు తనకు అసలు నిద్ర, తిండి ఉండవని నాగవంశీ పేర్కొన్నారు. సినిమా విడుదలైన తర్వాత రెవెన్యూ సెటిల్మెంట్కు సంబంధించిన విషయాలు స్పష్టంగా తెలిసే వరకు తీవ్ర ఆందోళన ఉంటుందని చెప్పారు. బయటకు చూస్తే నిర్మాతలు చాలా ప్రశాంతంగా, సంతోషంగా కనిపించినప్పటికీ.. వారి మనసులో ఎలాంటి ఒత్తిడి నడుస్తుందో ఎవరికీ తెలియదన్నారు. తనతో పాటు ప్రయాణించే ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు మాత్రమే తన ఒత్తిడి ఎంత ఉంటుందో తెలుసని అన్నారు. వారితో తరచూ ఫోన్లో మాట్లాడుతుంటానని, తన ఆందోళనను దగ్గరగా ఉండేవారే అర్థం చేసుకోగలరని చెప్పారు. సినిమా రిలీజ్‌కు ముందు వారం రోజుల పాటు అంతా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుందని.. అయితే నిర్మాత, దర్శకుడి మనసులో మాత్రం ఎన్నో టెన్షన్స్ ఉంటాయని నాగవంశీ కామెంట్స్ చేశారు. బయట నుంచి చూసినంత గ్లామరస్‌గా సినిమా ఫీల్డ్ ఉండదని, ప్రతి సక్సెస్ వెనుక ఎంతో ఒత్తిడి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!