MLC Kavitha: కేసీఆర్ మై హీరో.. త్రివిక్రమ్ డైలాగుతో కవిత వీడియో పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అధికార భారత రాష్ట్ర సమితికి నిరాశ కలిగించాయి. ఓటమి తప్పదన్న సంకేతాలు పంపారు. మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్ ఆశలు నీరుగారిపోయాయి. తెలంగాణలో గురువారం పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన సంగతి తెలిసిందే. కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ వైపు చూపించాయి. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా స్పష్టం చేయలేదు. ఒకటి రెండు మినహా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపాయి. హస్తం పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయో ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నానికి తేలనుంది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ కింది స్థాయి నేతలు కూడా గెలుపుపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదని అంటున్నారు.
Read also: Winter Season : చలికాలంలో రోజూ నారింజను తింటే ఏమౌతుందో తెలుసా?
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు జిల్లా కార్యాలయాల్లో సంబరాలు, ఉత్సాహ వాతావరణం కనిపించలేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని, తాము అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ ట్వీట్ చేశారు. కేసీఆర్‌ను హీరో అని అభివర్ణించారు. నా హీరో అంటూ కేసీఆర్‌తో ఓ చిన్న వీడియో క్లిప్‌ని కవిత పంచుకున్నారు. రచయితగా దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన డైలాగ్స్‌తో కేసీఆర్ నడుస్తూ వస్తున్న వీడియోను కవిత షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మరింది.
My hero❤️#KCR#JaiTelangana pic.twitter.com/LU5AEuOCi7
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 2, 2023
Winter Season : చలికాలంలో రోజూ నారింజను తింటే ఏమౌతుందో తెలుసా?
తాజావార్తలు
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!