హైదరాబాద్లో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను టీ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 మి.లీ లిక్విడ్ మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. టీఎస్ న్యాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి ప్రెస్ మీట్ నిర్వహించారు. సూరారంలో డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్నామని అన్నారు. సూరారం పోలీసులతో పాటు టీఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారని పేర్కొన్నారు.
అఫ్జల్ గంజ్ పోలీసులు టీఎస్ న్యాబ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి అంతర్ రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారులను అరెస్టు చేశామని హైదరాబద్ సీపీ సందీప్ సాండిల్య తెలిపారు.