ఈ మధ్య కాలంలో నిందితులకు తెలివి తేటలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. నేరం చేసేసి చాలా ఈజీగా తప్పించుకుంటున్నారు. కొన్ని సార్లు సినిమాలు, సీరియల్స్ చూసి కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని పట్టుకోవడం పోలీసులకు కూడా సవాల్ గా మారుతుంది. అయితే సీసీ కెమెరాలను అన్ని చోట్ల అర్చడంతో కొన్ని రకాల కేసులను చేధించడం పోలీసులకు చాలా సులభం అవుతుంది. ఇలా సీసీ కెమెరాలను చూసే ఓ నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో అదిరిపోయే ట్విస్ట్ కూడా ఉంది.
Also Read: Box Office War: అక్క చెల్లెళ్ళ మధ్య చిచ్చు పెట్టిన సినిమా…
అసలు విషయం ఏంటంటే.. ముంబైలోని సియోన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ 73ఏళ్ల వృద్ధురాలు బుధవారం ఆలయానికి వెళ్లింది. అయితే ఆమె చాలా సేపటివరకు తిరిగి రాలేదు. ఇంతలో వారి కుటుంబ సభ్యులకు ఓ ఫోన్ వచ్చింది. వృద్ధురాలు రోడ్డు దాటుతుండగా కళ్లు తిరిగి పడిపోయింది ఆసుపత్రితో చేర్పించామని. దీంతో హుటాహుటిన అక్కడి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆరా తీశారు. అప్పుడు అన్సారీ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా వృద్ధురాలు కళ్లు తిరిగి పడిపోయిందని తానే ఆసుపత్రికి తీసుకువచ్చానని కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో వారు అతనికి ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే చికిత్స పొందుతూ ఆ పెద్దావిడ మరుసటి రోజు మరణించింది. ఆమెకు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ జరిగింది. ఏదో దాని కోసం ఆ ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాను పరిశీలించారు పోలీసులు. అప్పుడే వారి కంట ఓ షాకింగ్ ఘటన పడింది. అందులో ఎవరైతే వృద్ధురాలిని ఆసుపత్రిలో చేర్పించాడో ఆ వ్యక్తే వేగంగా వచ్చి ముసలావిడను కారుతో గుద్దాడు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా ఆసుపత్రిలో చేర్పించాడు. కళ్లు తిరిగి పడిపోతే తీసుకువచ్చానంటూ కట్టుకథ అల్లి అందరిని నమ్మించాడు. ఇదంతా తెలుసుకొని వృద్ధురాలి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు.