Drinkers Hulchul: ఒక వయస్సు తర్వాత తాగడం నేరం కాదు.. కానీ తాగి రోడ్లపై న్యూసెన్స్ చేయడం, డ్రైవింగ్ చేయడం మాత్రం నేరమే. ఈ నిర్లక్ష్యానికి ఎంత నష్టం ఉంటుందో ఊహించలేరు. ఏం చేస్తున్నారో సోయి ఉండదు. తాగుతారు.. తాగి రోడ్డెక్కుతారు.. మత్తులో డ్రైవింగ్ చేసి జనాలను గుద్దేస్తారు. యమకింకరుల్లా మారి ప్రాణాలు తీసేస్తారు. గత ఆదివారం పుణెలో జరిగిన ఘటన గురించి తెలిసిందే. ఖరీదైన పోర్షె కారును 200 కిలోమీటర్ల వేగంతో నడిపి ఇద్దరు ఐటీ ఉద్యోగుల ప్రాణాలను బలి తీసుకున్నాడు ఓ మైనర్. సిటీలోనే బడా బిల్డర్ విశాల్ అగర్వాల్ కొడుకు. బాగా డబ్బులు ఉండడంతో అధికారులను మేనేజ్ చేసి బయటపడినట్లు తెలుస్తోంది. అరెస్టయిన కొన్ని గంటల్లోనే బెయిల్ తీసుకొని బయటపడ్డాడు. చనిపోయిన ఇద్దరు ఐటీ ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తు్న్నారు. ఏం చేస్తే ఆ కుటుంబాలకు జరిగిన నష్టం చెల్లిపోతుందని మండిపడుతున్నారు. ఇది జరిగిన తర్వాత కారు నడిపింది విశాల్ అగర్వాల్ కొడుకు కాదని.. మరెవరో డ్రైవర్ కారు నడిపినట్లు ఆధారాలు సృష్టిస్తున్నట్లు సమాచారం. అసలు మైనర్‌కు వాహనం ఇవ్వడమే నేరం అంటే.. ఆ మైనర్ కారు నడపడం పెద్ద నేరం. మైనర్ కారు నడపడం వల్ల రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి.
Read Also: Telangana Temperatures: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. 44.9 డిగ్రీలు దాటిపోతోంది..
ఇక తాజాగా హైదరాబాద్‌లో ఓ జంటకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అందరూ ఉదయాన్నే ఎవరి పనుల్లో వాళ్లు ఉంటారు. కొందరు వాకింగ్‌కు వెళ్తారు లేదా ఇంట్లోనే వంట చేసుకుంటారు. కానీ ఈ జంట వాకింగ్ ట్రాక్‌పైకి కారు వేసుకురావడమే కాకుండా.. ఓ చేత్తో బీర్ బాటిల్, మరో చేతిలో సిగరెట్ పెట్టుకుని న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ఈ జంటను ప్రశ్నించిన వాకర్లపై వీరంగం చేశారు. వారిద్దరిని చూస్తే రాత్రి నుంచి ఉదయం వరకు తాగుతూ ఉన్నట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాగండి.. ఆరోగ్యం పాడుచేసుకోండి.. అది తాగే వారి రిస్క్. కానీ తాగి న్యూసెన్స్ చేయడం, తాగి వాహనాలు నడిపి ప్రాణాలు తీయడం నేరం. క్షణం అటు ఇటు అయితే ప్రాణం పోతుంది. ఆ కుటుంబాలకు ఎంతటి క్షోభనో ఆలోచించాలి.