ఒక వయస్సు తర్వాత తాగడం నేరం కాదు.. కానీ తాగి రోడ్లపై న్యూసెన్స్ చేయడం, డ్రైవింగ్ చేయడం మాత్రం నేరమే. ఈ నిర్లక్ష్యానికి ఎంత నష్టం ఉంటుందో ఊహించలేరు. ఏం చేస్తున్నారో సోయి ఉండదు. తాగుతారు.. తాగి రోడ్డెక్కుతారు.. మత్తులో డ్రైవింగ్ చేసి జనాలను గుద్దేస్తారు. యమకింకరుల్లా మారి ప్రాణాలు తీసేస్తారు.