వరకట్నాలు, అదనపు కట్నపు వేధింపులు ఎక్కువైపోతున్నాయి. డబ్బు కోసం భార్యల ప్రాణాలు తీస్తున్నారు కొంతమంది భర్తలు. గ్రేటర్ నోయిడాలో నిక్కీ భాటి అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. అదనపు కట్నం కోసం వేధిస్తూ ఆమె భర్త విపిన్ భాటి, అత్తమామలు కలిసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితురాలి కొడుకు తన తండ్రే అమ్మను కాల్చి చంపాడని పోలీసులకు తెలిపాడు.
Also Read:Heavy Rains : ఉత్తరాదిలో భారీ వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు
మృతురాలి అక్క, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో నిందితుడి కాలికి గాయం అయినట్లు వెల్లడించారు. విపిన్ అరెస్టు కాగా, అతని తల్లి దయా, తండ్రి సత్యవీర్, సోదరుడు రోహిత్ పరారీలో ఉన్నారు.
Also Read:Surya : సూర్య కోసం భారీ సెట్.. వెంకీ అట్లూరి సినిమా నెక్స్ట్ లెవెల్!
నిక్కీ తండ్రి భికారి సింగ్ పయ్లా మాట్లాడుతూ నిందితులను కాల్చి చంపాలని కోరుకుంటున్నానని చెప్పాడు. “వారు హంతకులు, వారిని కాల్చి చంపాలి, వారి ఇంటిని ధ్వంసం చేయాలి. నా కుమార్తె పార్లర్ నడుపుతూ తన కొడుకును పెంచుతోంది. వారు ఆమెను హింసించారు. మొత్తం కుటుంబం కుట్రలో పన్నింది.. వారు నా కుమార్తెను చంపారు,” అని విపిన్ తప్పించుకోవడానికి ప్రయత్నించడానికి కొన్ని గంటల ముందు, పోలీసులు కాల్పులు జరపడానికి ముందు తెలిపాడు.