CM Chandrababu: అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గతంలో సీఎం వస్తే ట్రాఫిక్ ఆపేవారు.. పరదాలు కట్టేవారంటూ ఎద్దేవా చేసిన ఆయన.. నా కోసం మాత్రం ట్రాఫిక్ ఆపొద్దు.. పరదాలు కట్టొద్దు అని పోలీసుల అధికారులకు సూచించారు.. నాకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఫర్వాలేదు.. కానీ, జనాన్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అన్నారు.. కొందరు మా ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ గురించి చెబుతున్నారు. జగన్ హెలీకాప్టర్‌లో వెళ్తే.. కింద ట్రాఫిక్ ఆపేస్తారట.. ఇదేంటో అర్థం కాలేదని దుయ్యబట్టారు సీఎం చంద్రబాబు నాయుడు.
Read Also: Hyderabad: సూసైడ్ నోట్ రాసి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. కారణమిదే..?
మరోవైపు వైఎస్ వివేకా హత్యపై సభలో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.. హూ కిల్డ్ బాబాయ్..? ఎవరో చెప్పాలన్న చంద్రబాబు. దీనికి విష్ణురుమార్ రాజు అయినా సమాధానం చెబుతారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.. చంద్రబాబు స్పీచ్ మధ్యలో ఇంటర్వీన్ అయిన విష్ణుకుమార్ రాజు. ఐదేళ్ల పాటు విధ్వంసకర పాలన చూశామన్నారు.. ఇంతటి విధ్వంసకర పాలన చూసిన తర్వాత కూడా 40 శాతం ఓట్లెలా వచ్చాయోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. వివేకా హత్య విషయంలో సీబీఐ విచారణలో వాస్తవాలు తేలుతాయని విష్ణు కుమార్ రాజు అనగా..? కేంద్రమే తేల్చాలన్నారు టీడీపీ సభ్యులు. హూ కీల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభిస్తుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..