మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 2-0తో రోహిత్ సేన కైవసం చేసుకుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా బుధవారం (ఫిబ్రవరి 12) మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ జై షా కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్ వన్డేలో తాము అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ఓ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.…