O Yeong Su: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెబ్‌సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ లో కీలక పాత్ర పోషించిన కొరియన్ నటుడు ఓ యోంగ్ సు (O Yeong Su) 80 ఏళ్ల వయస్సులోనూ తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. అయితే, ఓ లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలాడు. ఇటీవల తనపై నమోదైన కేసు కారణంగా వివాదాల్లో చిక్కుకున్నారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ఓ యోంగ్ సు సినీ పరిశ్రమలో దాదాపు 50 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ను లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో బాధితురాలు కోర్టును ఆశ్రయించి తన కెరీర్ పాడయిపోయిందని, జీవనాధారాన్ని కోల్పోయానని వాదించింది.
Read Also: 28 Degree Celsius Review: 28 డిగ్రీ సెల్సియస్ రివ్యూ..ఆరేళ్ళ క్రితం సినిమా ఎలా ఉంది?
అయితే, కోర్టు విచారణ సందర్భంగా తాను ఎలాంటి తప్పు చేయలేదని ఓ యోంగ్ సు పేర్కొన్నారు. అయితే, పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా తనను తాను సమర్థించుకోవడం గమనార్హం. కోర్టు ఇరు పక్షాల వాదనలు, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించి తనను దోషిగా ప్రకటిస్తూ ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు కొరియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఓ యోంగ్ సు ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.