Ar Rahman : ఆ ఒక్క ట్యూన్ రెహ్మాన్ జీవితాన్ని మార్చేసింది తెలుసా!!
- ఆ ఒక్క ట్యూన్ రెహ్మాన్ జీవితాన్ని మార్చేసింది
- కీబోర్డు ప్లే చేస్తూ మణిరత్నం కంటపడ్డ రెహ్మాన్
- అవకాశం ఇవ్వడంతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా అవతరణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవితంలో సక్సెస్ అవడానికి అవకాశం కావాలా? అదృష్టం కావాలా? అంటే ఎవరూ చటుక్కున దేన్నీ ఎంపిక చేసుకోలేరు. నిజానికి మనం ఎంత కష్టపడినా లాభం లేదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలి అంటారు కొందరు. ఎంత అదృష్టం ఉన్నా ఏం లాభం? అవకాశాలు రావాలి కదా అంటారు మరికొందరు. ఇదంతా ఒకరకం అయితే వచ్చిన అవకాశాన్ని, అదృష్టాన్ని ఒకేసారి ఒడిసి పట్టుకుని క్షణాల్లో సక్సెస్ ను ఎగరేసుకుపోతారు కొంత మంది. అలాంటి అద్భుతమైన క్షణాల్లో చేసిన ఓ ట్యూన్ సంగీత సంచలనం రెహ్మాన్ జీవితాన్ని ఆస్కార్ దరికి చేర్చిందని మీలో ఎంత మందికి తెలుసు? చెప్పండి.
Read Also: CM Chandrababu: కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి వరాల జల్లు..
Also Read
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’తో రెహ్మాన్ సంగీత దర్శకుడిగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి ముందు రెహ్మాన్ కీబోర్డ్ ప్లేయర్ పని చేసేవాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫంక్షన్స్ లో జరిగే మ్యూజికల్ ఈవెంట్స్ లో పాల్గొనే వారట. అలా ఒకసారి మణిరత్నం బొంబాయిలో జరిగిన ఒక ఫంక్షన్ కి అటెండ్ అయి అక్కడ రెహ్మాన్ కీబోర్డ్ వాయించడాన్ని చూశారు. ఫంక్షన్ అనంతరం రెహ్మాన్ ఎదురుపడగా, మణిరత్నం అతనికి తన విజిటింగ్ కార్డు ఇచ్చి ఒకసారి కలువమన్నారు. అప్పటికే మణిరత్నం పేరు దక్షిణాదిన మారుమోగుతోంది. తమిళవాడైన రెహ్మాన్ కూడా మణిరత్నం అభిమాని కావడంతో ఆనందంతో సరే అని మరుసటి రోజు మధ్యాహ్నమే మణిరత్నం ఇంటి ముందుకు వెళ్ళి నిలబడ్డాడు.
Read Also: Atishi: సీఎం బంగ్లా మరోసారి రద్దు.. ప్రజల ఇళ్లల్లోనే ఉంటానన్న అతిషి
ఎందుకో పోర్టికోలోకి వచ్చిన మణిరత్నం గేటు బయట నిలబడ్డ రెహమాన్ ను గుర్తుపట్టి లోపలకు రమ్మన్నారు. పూర్తి వివరాలు తెలుసుకుని, మంచి ట్యూన్ ఏదైనా చేసి తీసుకురా చూద్దాం అంటే రెహ్మాన్ తలూపి వెళ్లిపోయి రాత్రి 7 గంటలకు మణిరత్నం బయటకు వెళ్లే సమయానికి గేటు దగ్గర రెహ్మాన్ నిలబడి ఉన్నాడు. దగ్గరకు పిలిచి మధ్యాహ్నమే కదా కలిశావు మళ్లీ ఏంటి? అని అసహనంగా అంటే దానికి రెహ్మాన్ ట్యూన్ చేశా అంటూ ఆడియో క్యాసెట్ ఒకటి ఆయన చేతిలో పెట్టారట. సుహాసిని ఇంకా కారు ఎక్కక పోవడంతో ఆ క్యాసెట్ను కారులోని స్టీరియోలో పెట్టి ఆన్ చేశారట. ట్యూన్ వింటున్న మణిరత్నం మొహంలో క్రమ క్రమంగా సంతోషం పొంగు కొస్తోంది. చివరిగా ఎగిరి గంతేసినంత పని చేసి ట్యూన్ ఈరోజు చేసిందేనా అని అడిగారట. రెహ్మాన్ అవును అనగానే అతన్ని గట్టిగా కౌగిలించు కున్నారట. ఇంతకీ ఆ ట్యూన్ ఏంటో తెలుసా ? “చిన్ని చిన్ని ఆశ” పాట. అదండీ ఈ సంగతి ఆ ట్యూన్ రెహ్మాన్ లైఫ్ ను టర్న్ చేసి ఆస్కార్ స్థాయికి తీసుకు వెళ్ళిందన్న మాట.
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!