మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రోజా'తో రెహ్మాన్ సంగీత దర్శకుడిగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి ముందు రెహ్మాన్ కీబోర్డ్ ప్లేయర్ పని చేసేవాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫంక్షన్స్ లో జరిగే మ్యూజికల్ ఈవెంట్స్ లో పాల్గొనే వారట. అలా ఒకసారి మణిరత్నం బొంబాయిలో జరిగిన ఒక ఫంక్షన్ కి అటెండ్ అయి అక్కడ రెహ్మాన్ కీబోర్డ్ వాయించడాన్ని చూశారు.