Lochan Thakur : మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మృణాల్ ఇటీవల హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో అలరించింది. ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్స్ లో ఆమె కూడా ఒకరు. అయితే మృణాల్ బయట, సినిమాల్లో అంత అందంగా కనిపించడానికి కారణం ఎవరో తెలుసా?
Read Also: N convention : నాగార్జున పై కేసు నమోదు
మృణాల్ ఠాకూర్ అందానికి కారణం తన అక్క లోచన్ ఠాకూర్. లోచన్ ఠాకూర్ మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ గా సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. మృణాల్ మొదటి సినిమా నుంచి కూడా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు మృణాల్ ఠాకూర్ కి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుది ఆమె అక్క లోచన్. సీతారామం, ఇటీవల హాయ్ నాన్న సినిమాల్లో మృణాల్ ని అంత అందంగా చూపించింది తన అక్క లోచన్ ఠాకూర్ నే.
Read Also:Yash-Toxic: యష్’ బిగ్ షాక్.. ‘టాక్సిక్’ ఆగిపోయిందా?
అలాగే మృణాల్ కి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ గా కూడా లోచన్ ఠాకూర్ పని చేస్తుంది. అంతే కాకుండా బాలీవుడ్ లో సినిమాలకు మేకప్ ఆర్టిస్ట్ గా, పలువురు సెలబ్రిటీలకు కూడా పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంది లోచన్ ఠాకూర్. గతంలో పలు మార్లు మృణాల్ తన అక్కతో దిగిన ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. తాజాగా నేడు లోచన్ ఠాకూర్ పుట్టిన రోజు కావడంతో మృణాల్ తన అక్కతో కలిసి చిన్నప్పుడు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి స్పెషల్ గా బర్త్ డే విషెష్ తెలిపింది.