Yash-Toxic: కెజీయఫ్‌తో పాన్ ఇండియా హీరో స్టార్ డమ్ అందుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యష్.. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందనే న్యూస్ ఒకటి షాకింగ్‌గా మారింది. వాస్తవానికైతే.. కెజీయఫ్‌తో వచ్చిన క్రేజ్‌తో యష్ ఈపాటికే కనీసం ఒక్క సినిమా అయిన చేసి ఉండాల్సింది. కానీ పాన్ ఇండియా క్రేజ్‌ను కాపాడుకోవడానికి ఏ మాత్రం తొందర పడలేదు యష్. ఆచితూచి అడుగులేస్తున్నాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని.. ఇటీవలె లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో ‘టాక్సిక్’ అనే మూవీ స్టార్ట్ చేశాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్లుగా నయనతార, శ్రుతి హాసన్, కియారా అద్వానీ నటిస్తున్నట్టుగా ప్రచారంలో ఉది. ఇప్పటికే రిలీజ్ చేసిన యష్ లుక్ అదిరిపోయింది.
ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో టాక్సిక్ పై భారీ అంచనాలున్నాయి. కానీ ఇప్పుడు డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ టేకింగ్‌తో యష్ సంతృప్తిగా లేడని.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేసే సత్తా తనకి లేదని ఫీల్ అవుతున్నాడట. దీంతో.. టాక్సిక్ మూవీ మధ్యలోనే ఆగిపోయిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కానీ ‘టాక్సిక్’ మూవీ ఆగిపోలేదని, కొన్ని కారణాల వల్ల షూటింగ్‌కి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే తిరిగి షూటింగ్ ప్రారంభించి, 2025 సెకండాఫ్‌లో ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. మరి టాక్సిక్ టీమ్ నుంచి ఈ విషయంలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Read Also:Tripti Dimri : షూటింగులో ఆ బాధ తట్టుకోలేక రోజూ ఇంటికెళ్లి ఏడ్చేదాన్ని : తృప్తి దిమ్రీ