Do Not Drink Water After eating Fruits: నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. అదేవిధంగా పండ్ల వినియోగం మానవ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే, ఈ రెండింటికి సంబంధించి ఒక చిన్న పొరపాటు మీకు హాని చేస్తుందని మీకు తెలుసా..? అవును, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. మరి అవేంటో.. అలాంటి కొన్ని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Olympics India: వేరే దేశాలకు ఒలంపిక్ పతకాలు సాధించిన భారత సంతతి క్రీడాకారులు ఎవరో తెలుసా..?
అరటిపండు :
ఎక్కువగా తినే పండ్లలో అరటిపండు ఒకటి. తరచుగా మనం అరటిపండు తిన్న తర్వాత నీరు తాగుతాము. అయితే, మనం అలా చేయకూడదు. ముఖ్యంగా అరటిపండు తిన్న తర్వాత మీరు చల్లని నీరు త్రాగకూడదు. నీరు జీర్ణవ్యవస్థకు అరటిపండ్లను జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది. ఇది గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. దీనిని నివారించడానికి అరటిపండు తిన్న 15 – 20 నిమిషాల తర్వాత నీరు త్రాగాలి.
బొప్పాయి:
బొప్పాయి జీర్ణవ్యవస్థకు మంచిది. అలాగే దాని వినియోగం ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు బొప్పాయి తిన్న వెంటనే నీరు త్రాగితే అది ప్రయోజనాలకు బదులుగా హాని కలిగించవచ్చు. దీని వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. అంతేకాదు మీకు డయేరియా వంటి సమస్యలు కలగవచ్చు. ఇలా చేయడం వల్ల కడుపు లోపలి పొర కూడా దెబ్బతింటుంది. దీని కారణంగా మీరు వికారంగా ఉండడం.. అలాగే విశ్రాంతి తీసుకోలేరు.
Maoists Attack: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఎస్టీఎఫ్ జవాన్లు, మహిళా నక్సల్ మృతి..
జామపండు:
జామపండు తిన్న వెంటనే నీరు త్రాగకూడదు. నిజానికి జామపండు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ pH స్థాయి మరింత దిగజారుతుంది. అంతేకాకుండా యాసిడ్ పెరుగుతుంది. దీనివల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. మీరు దీన్ని నివారించాలనుకుంటే జామ తిన్న 35 నుండి 40 నిమిషాల తర్వాత మాత్రమే నీరు త్రాగాలి.
పుచ్చకాయ:
పుచ్చకాయ తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు. పుచ్చకాయలో ముందే చాలా నీరు ఉంటుంది. కాబట్టి మీరు దీని తర్వాత నీటిని తాగితే అది కడుపులో వాపు లేదా భారాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా పుచ్చకాయలో షుగర్, ఫైబర్ కూడా ఉంటాయి. తిన్న తర్వాత నీటిని తాగితే బ్యాక్టీరియా నేరుగా కడుపులోకి చేరుతుంది. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.