NTV Telugu Site icon

DMK MP A. Raja: లౌకికవాదాన్ని బోధిస్తున్న బీజేపీకి.. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు?

Raja

Raja

వక్ఫ్ సవరణ బిల్లును ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ సిద్ధం కాగా.. ఇండియా బ్లాక్ మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉంది. లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ ఎ. రాజా భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని పార్టీ మైనారిటీల హక్కులను కాపాడేందుకు ఈ బిల్లును తీసుకురావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టగల లేదా దాని లక్ష్యాన్ని సమర్థించగల ముస్లిం ఎంపీ బీజేపీలో లేరని, ఇప్పుడు వారు మనకు లౌకికవాదాన్ని బోధిస్తున్నారని ఎంపీ రాజా అన్నారు. కొద్దిసేపటి క్రితం మంత్రి ధైర్యంగా ప్రసంగించారని .. రేపు మీరు మీ ప్రసంగ పాఠాన్ని జేపీసీ నివేదికతో పోల్చి చూడాలని తాను ధైర్యంగా చెబుతున్నానన్నారు. అది సరిపోలితే తాను ఈ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

READ MORE: Waqf Amendment Bill: 22 మంది సభ్యులు ఉన్న వక్ఫ్‌ బోర్డులో 10 మంది మాత్రమే ముస్లింలు?

వక్ఫ్ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సభ ద్వారా దేశం మొత్తంపై రాజకీయ బిల్లును రుద్దుతున్నారని అన్నారు. తమిళనాడు ఆమోదించిన తీర్మానాన్ని విస్మరిస్తే అది దేశ ఐక్యతపై ప్రశ్నార్థకం అవుతుందన్నారు.. వక్ఫ్ చట్టంలో సవరణ అంశం కూడా జేపీసీకి వెళ్లిందని ముస్లిం పర్సనల్ లా బోర్డు జనరల్ సెక్రటరీ అన్నారని గుర్తు చేశారు. జేపీసీ తన నివేదికను దాఖలు చేసిందని.. దీనికి వ్యతిరేకంగా 5 కోట్ల ఈ-మెయిల్స్ వచ్చాయని చెప్పారన్నారు. తమ అభిప్రాయం ప్రకారం.. ఈ బిల్లు ఇప్పుడు మరింత అభ్యంతరకరంగా మారిందని విమర్శించారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలు ఏవీ అంగీకరించబడలేదన్నారు. వక్ఫ్ నిర్వహణ ఇప్పుడు ముస్లింల చేతులు వీడుతుందన్నారు. జేపీసీ కేవలం ఒక కపటం, మోసం అని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకు తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.

READ MORE: LRS Date Extended: అప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపు గడువు పెంచిన ప్రభుత్వం